/rtv/media/media_files/2026/01/04/venezuela-high-court-orders-vp-to-temporarily-assume-presidency-2026-01-04-21-32-08.jpg)
Venezuela High Court Orders VP to Temporarily Assume Presidency
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ నియమితులయ్యారు. ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం చేస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటన చేసింది. అమెరికా సైన్యం శనివారం వెనెజువెలా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడి చేసి నికోలస్ మదురోను, ఆయన భార్యను తీసుకెళ్లింది.
Also Read: ట్రంప్‌లా మోదీ ఎందుకు చేయలేదు.. వెనిజులా ఘటనపై ఒవైసీ రియాక్షన్!
ఆ దేశంలో పరిపాలన కొనసాగింపు అంశం దృష్ట్యా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. లీగా సోషలిస్ట్ పార్టీ ఫౌండర్ జార్జ్ ఆంటోనియో కూతురే డెల్సీ రోడ్రిగ్స్. ఈమె 1969లో కారకాస్‌లో జన్మించారు. మదురో పాలనలో ఆమె కమ్యూనికేషన్, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు. 2018లో ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆ స్థానంతో పాటు ఆర్థిక, చమురు మంత్రిత్వశాఖలకు మంత్రిగా ఉన్నారు.
Also Read: జపాన్‌లో టెన్షన్, టెన్షన్.. నార్త్ కొరియా క్షిపణలు ప్రయోగం..
ఇటీవల ట్రంప్ ఇతర దేశాలతో పాటు వెనెజువెలాపై కూడా సుంకాలు విధించారు. దీంతో ఆ దేశాన్ని ద్రవ్యోల్బణం నుంచి బయటపడేందుకు డెల్సీ చర్యలు తీసుకున్నారు. మదురోకు నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమెకు ట్రంప్ కూడా సపోర్టు చేస్తున్నారు. వెనెజువెలాను గొప్పగా మార్చేందుకు చేయాల్సిన పనులపై డెల్సీ సానుకూలంగా ఉందని అన్నారు. అలాగే అక్కడ మార్పు వచ్చేవరకు వెనెజువెలా అమెరికా కంట్రోల్‌లోనే ఉంటుందని పేర్కొన్నారు.
Follow Us