Trump Tariffs: అమెరికాలో మాయం అవనున్న బిర్యానీ..భారత బియ్యంపై సుంకాలని ట్రంప్ బెదిరింపు..

ఒకవైపు భారత్ తో వాణిజ్య చర్చలు జరుపుతూనే మరోవైపు మన దేశంపై వరుస సుంకాలతో విరుచకు పడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తాజాగా మరోసారి ఇండియా బియ్యంపై టారిఫ్ లను విధిస్తానంటూ హెచ్చరించారు. అలా చేస్తే అమెరికాకే నష్టమంటున్నారు నిపుణులు.

New Update
rice tariffs

భారత్ తో అమెరికా వైఖి ఏటో అ్థం కావడం లేదు. ఇండియా తమకు మిత్ర దేశమని అంటారు. ప్రధాని మోదీ(PM Modi) తనకు మంచి స్నేహితుడని చెబుతారు.. కానీ ట్రంప్ మాత్రం భారత్ పై సుంకాలను(trump tariffs) విధించడం మానరు. ఒకవైపు భారత్  వాణిజ్య చర్చలు సాగిస్తూనే మరోవైపు సుంకాలను బాదేస్తున్నారు. తాజాగా భారత బియ్యంపై సుంకాలను విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రపంచంలోనే నంబర్ వన్ బియ్యం ఎగుమతిదారుగా, డజన్ల కొద్దీ దేశాలకు భారతీయ బియ్యం సరఫరా అవుతున్న నేపథ్యంలో ట్రంప్ హెచ్చరికలు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.  ఆయన చర్యలు అంతర్జాతీయ ఆహార సరఫరా గొలుసుకు అతి పెద్ద ఆటంకంగా మారుతుందని అంటున్నారు. 

Also Read :  మరో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

బుద్ధిలేని చర్యలు..

అమెరికా రైతులు ప్రయోజనాల కోసం భారత బియ్యంపై సుంకాలను విధిస్తానని చెబుతున్నారు ట్రంప్. కానీ ఇది అత్యంత అర్థ రహితమైన చర్య అంటున్నారు వాణిజ్య నిపుణులు. భారత బియ్యం లేకుండా అమెరికా మనుగడ సాధించగలదా అని ప్రశ్నిస్తున్నారు.  అమెరికాలో బియ్యం రెగ్యులర్ పంట కాదు. అసలు అది వారి మెయిన్ పంట కానే కాదు. ఆ దేశం మొత్తం భారత బియ్యంపైనే ఆధారపడి ఉంది. రెండేళ్ల క్రితం ఒక సందర్భంలో బియ్యం సఫరా అవకపోవడంతో దాదాపు రెండు నెలలు అమెరికాలో జనాలు నానా ఇబ్బందులు పడ్డారు. అలాంటిది ఇప్పుడు భారత బియ్యంపై సుంకాలను విధిస్తే అమెరికా ఎలా తట్టుకుంటుంది అని అడుగుతున్నారు. బియ్యం అనేది వినియోగదారుల డిమాండ్, ఆహారపు అలవాట్ల ద్వారానే ఎగుమతులు అవుతాయని...దాన్ని వ్యాపారం కింద లెక్కించడం సరై విషయం కాదని ఐఆర్ఈఎఫ్ సమాఖ్య చెబుతోంది. REF ప్రకారం, భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో $337.1 మిలియన్ల విలువైన 274,213 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యాన్ని అమెరికాకు ఎగుమతి చేసింది. దీని వలన అమెరికా భారతీయ బాస్మతికి నాల్గవ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 61,341 మెట్రిక్ టన్నులు, దీని విలువ $54.6 మిలియన్లు, దీనితో అమెరికా ఈ వర్గానికి 24వ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచిందని చెబుతోంది. 

ప్రపంచ ఆహార భద్రతకే ముప్పు..

అమెరికాకు గల్ఫ్ దేశాలు, ఇండియా నుంచి వచ్చే బియ్యమే పునాది అని చెబుతున్నారు. అమెరికాలో పండించే బియ్యం రకాలు బాస్మతీని రిప్తేస్ చేయలేవు అంటున్నారు. బాస్మతిని అక్కడ పండించే పరిస్థితులు, వాతావరణం కూడా ఉండదని చెబుతున్నారు. అలాంటి బియ్యంపై సుంకాలు విధిస్తే అమెరికాకే సమస్య అవుతుందని అంటున్నారు. దీని వలన యూఎస్ లో బియ్యం ధరలు పెరుగుతాయి. ఆఫ్రికా, గల్ఫ్ దేశాలలో ప్రత్యామ్నాయం అత్యంత ఖరీదుగా మారుతుంది. పాకిస్తాన్, థాయ్ లాండ్ పై ఒత్తిడి పెరుగుతుంది. అయినా కూడా అవి భారత్ ను రిప్లేస్ చేయలేవు. దీని వలన ప్రపంచ మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. భారతదేశ బియ్యం ఎగుమతులు కేవలం వాణిజ్యానికి సంబంధించినవి మాత్రమే కాదు, ప్రపంచ భౌగోళిక రాజకీయ, ఆహార భద్రతకు సంబంధించినవని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఇలాంటి తెలివి తక్కవు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. 

Also Read :  గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం 40% ..

భారత ప్రభుత్వ అధికారిక నివేదిక అయిన DGCIS ప్రకారం.. 2021- 2023 మధ్య ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశ వాటా 38.58%గా ఉంది. ఇధి 2023 నాటికి దాదాపు 46%కి పెరుగుతుందని అంచనా. పాకిస్తాన్, థాయిలాండ్ కూడా బియ్యాన్ని ఎగుమతి చేస్తాయి.. కానీ అవి భారతదేశం కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా  చైనా ఉంది. కానీ దానిలో ఎక్కువ భాగం చైనాలోనే వినియోగించబడుతుంది. ఎగుమతుల్లో చైనా వాటా కేవలం 4% మాత్రమే. చాలా దేశాలు భారత బియ్యంపైనే ఆధారుపడుతున్నాయి. ఇండియాకు అతి పెద్ద బియ్య కొనుగోలుదారులుగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యుఎఇ, యెమెన్, ఒమన్, ఖతార్.. ఈ ఏడు దేశాలు ఉన్నాయి. ఇవి మొత్తం ఎగుమతుల్లో 78% వాటా కలిగి ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు