Donald Trump: తెలంగాణకు ట్రంప్ బంపరాఫర్.. ఏకంగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఫ్యూచర్‌ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit 2025) వేదికగా ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్‌ ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని పేర్కొన్నారు.  

Also Read :  గుడ్‌న్యూస్.. భారత్‌లో స్టార్‌లింక్ సేవలు, సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ధరలు వెల్లడించిన మస్క్‌

Trump Media Investments In Telangana

ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ అన్నారు. తెలంగాణ ఇప్పటికే వేగంగా అభివృద్ధి అవుతున్న రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం అనేది గొప్ప విషయమని పేర్కొన్నారు. తెలంగాణ విజన్‌లో తాము భాగస్వాములు అయ్యేందుకు రెడీగా ఉన్నామని పేర్కొన్నారు.  

అదానీ పోర్ట్స్‌ అండ్ సెజ్‌ ఎండీ కరణ్‌ అదానీ మాట్లాడుతూ తెలంగాణ విజన్‌ను ఈ సమిట్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. అదానీ గ్రూప్‌ ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. సిమెంట్, గ్రీన్‌ డేటా సెంటర్స్‌, రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు దేశంలోనే తొలిసారిగా UAV టెక్నాలజీని హైదరాబాద్‌లో రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే UAVలను దేశ సైన్యానికి అందిస్తామని తెలిపారు. ప్రపంచమార్కెట్‌లో కూడా అమ్ముతామన్నారు. 

తెలంగాణలో రూ.25 వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్‌డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. లాజిస్టిక్స్‌లో కూడా రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అదానీ సంస్థ యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.4 వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలను కలిపే రహదారులను కూడా అదానీ సంస్థ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ.2 వేల కోట్లతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

Also Read :  అవును మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. ట్రూడో, కేటీ పెర్రీ ఇన్స్టాలో పోస్ట్ లు

Advertisment
తాజా కథనాలు