/rtv/media/media_files/2025/08/04/us-visa-2025-08-04-15-02-09.jpg)
Amid curbs on H1B and student visas, more Indians are lining up for US investment visas
అమెరికాలో అక్రమ వలసదారులపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఉక్కుపాదం మోపుతూనే ఉంది. ఇప్పటికే చాలా మందిని అమెరికా నుంచి ఇప్పటికే బయటకు పంపేశారు. ఈ క్రమంలో జనవరి నుంచి 80 వేలకు పైగా విదేశీ వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేసినట్లు తెలిసింది. హింస, చోరీ కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినవారే ఇందులో అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే రెట్టింపు వీసాలు ఈ పది నెలల్లో రద్దయ్యాయని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. దీన్ని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది.
సోషల్ మీడియా వెట్టింగ్..
జనవరి నుంచి అక్రమవలసదారులఏరివేత ప్రారంభం అయింది. మొదట్లో ప్రభుత్వమే ఫ్లైట్లను ఏర్పాటు చేసి మరీ అక్రమవలదారులను వారి స్వదేశాలకు పంపించారు. తరువాత కూడా చాలా మందిని బయటకు పంపించారు. ఈ క్రమంలో వీసాలపై కూడా దృష్టి పెట్టారు. సోషల్ మీడియా వెట్టింగ్ తో పాటూస్క్రీనింగ్ ను విస్తృతం చేశారు. స్థానిక చట్టాలను ఉల్లంఘించే వారి వీసాల రద్దును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వీసాల రద్దు గతంతో పోలిస్తే రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. ీక్రమంలో 6వేలకు పైగా విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. గడువు ముగిసినా అక్రమంగా దేశంలో ఉండటం, స్థానిక చట్టాలను ఉల్లంఘించిన కారణంగానే వీరి వీసాలు రద్దయ్యాయి. వీరిలో కొందరు ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన వారు ఉన్నారని చెప్పారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురి వీసాలను రద్దు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ తెలిపింది. పాలస్తీనీయన్లకుమద్దుతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేసే విద్యార్థులు, గ్రీన్ కార్డు దారులకూ బహిష్కరణ ముప్పు తప్పదని విదేశాంగశాఖ హెచ్చరించింది. ఈ కారణంగా కూడా చాలా మంది వీసాలు రద్దయి ఉండవచ్చని చెబుతున్నారు.
US revokes 80,000 student, work visas. This is what not to do https://t.co/g0nUCe2b99
— Dipranjan Sharma (@DipranjanS43173) November 6, 2025
Follow Us