/rtv/media/media_files/2025/10/07/gold-2025-10-07-13-06-20.jpg)
gold
Lucky Draw : ప్రతి మనిషికి అపుడపుడు అదృష్టం కలిచివస్తుంది.యూఏఈలో ఓ ప్రవాస భారతీయుడిని కూడా అలాగే అదృష్టం వరించింది. దుబాయ్‌లో బిగ్ టికెట్ ఈ డ్రాలో అతను పావుకేజీ బంగారం గెలుచుకున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..కేరళకు చెందిన నితిన్ కున్నత్ రాజ్ ఉపాధి నిమిత్తం 2016 దుబాయ్ వెళ్లాడు. అక్కడే నివసిస్తున్నాడు. అయితే ఆయన తాజాగా తన స్నేహితులతో కలిసి ఒక లాటరీ టికెట్ కొన్నాడు. అయితే దానికి తాజాగా జాక్‌పాట్ తగిలింది. ఈ విషయాన్ని కున్నత్‌కు షో నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు.. అయితే తొలుత ఆయన ఈ విషయాన్ని నమ్మలేదు. తర్వాత వారు తను కొన్న టికెట్ నంబర్ 351853తో సహా చెప్పడంతో ఆశ్చర్యపోయారు. ఈ టికెట్‌పై 250 గ్రాముల బంగారం గెలుచుకున్నారని వారు వివరించడంతో ఆశ్చర్యపోవడం నితిత్ వంతయింది. అది 24 క్యారెట్ల గోల్డ్ బార్. మన దేశంలో బంగారం ధరల ప్రకారం దాని విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుంది.
ఈ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ వేర్వేరు పేర్ల మీద 10 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొన్నానని, కనుక వచ్చిన బహుమతి కూడా వారితో పంచుకుంటానని నితిన్ కున్నత్ (Nithin Kunnath Raju) వెల్లడించారు. ఇలా తనకు అదృష్టం వరించడం ఇదే తొలిసారని ఆయన సంతోషం వ్యక్తంచేశారు. ఇటీవల బిగ్ ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్‌లో ప్రవాసుడైన శరవణన్ వెంకటాచలం రూ.60.42 కోట్లు (25 మిలియన్ల దిర్హామ్‌లు) గెలుచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నితిన్‌కు అదృష్టం దక్కింది.
Also Read: J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..
Follow Us