Trump: డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు..ఎందుకో తెలుసా!

డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. గ్రీన్‌లాండ్ కొనుగోలు విషయమై ఆమెతో మాట్లాడుతూ.. పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

New Update
Donald Trump

Donald Trump

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌..ఇంతుకు ముందులాగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను చేయాలనుకున్న పనులను అమలు చేస్తూనే.. కోరుకున్నవన్నీ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గ్రీన్‌లాండ్ కొనుగోలు చేయాలనుకున్న ట్రంప్.. ఈసారి పదవిలోకి రాకముందు నుంచే కచ్చితంగా ఈసారి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటానని గట్టిగా చెబుతున్నారు.

Also Read: Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు

ఆ కలను నెరవేర్చుకోవడానికి తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. ముఖ్యంగా వారి అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమ్మాలంటూ ఆయన ప్రతిపాదించారు.కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం అది కుదరదని చెప్పారట. పెద్ద ఎత్తున ఖనిజాలు లభించే గ్రీన్‌లాండ్‌ను అమ్మాలనే ఉద్దేశమే తమకు లేదని వివరించగా.. ట్రంప్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. 

సుంకాల గురించి కూడా...

ఈక్రమంలోనే మెటె ఫ్రెడెరిక్సన్‌తో చాలా దూకుడుగా మాట్లాడరట. తన కలను నెరువేర్చుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తుంది. ఆ మాటలు విన్న ట్రంప్ వద్దనున్న అధికారులు వాటికి ఆశ్చర్యపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. మొత్తం 45 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్‌లో.. ట్రంప్ డెన్మార్క్ మీద విధించబోయే సుంకాల గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం వాటేమిటికీ భయపడకుండా గ్రీన్‌లాండ్‌ను అస్సలే అమ్మమని గట్టిగా తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది.

Also Read: Madhya Pradesh: ప్రసాదం గా మద్యం..కానీ బంద్‌ చేసిన సర్కార్‌..మరీ ఆచారం సంగతేంటి!

ఈక్రమంలోనే ట్రంప్ కేవలం సుంకాలు మాత్రమే విధించకుండా.. ఇతర చర్యలు కూడా తీసుకోబోయే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ట్రంప్ ఎన్నోరోజులుగా కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రీన్‌లాండ్‌లో రాగి, లిథియం వంటి కనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన ఇక్కడ.. 2.16 మిలియన్ చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఖనిజాలు ఉన్నాయి. 75 శాతానికి పైగా ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ.. 30 శాతం గ్యాస్ నిల్వలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

కేవలం 55, 600 మంది మాత్రమే ఇక్కడ జీవిస్తుండగా.. దీన్ని చేజిక్కించుకోవాలని ట్రంప్ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. కానీ గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడం అంత సులువైన పని కాదని నిపుణులు అంటున్నారు.

Also Read: Apple IPhone 17: బెస్ట్ ఫీచర్లతో వచ్చేస్తున్న యాపిల్.. ఐఫోన్ సిరీస్ 17 వచ్చేది అప్పుడే?

Also Read: Maharashtra: పుణేను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్.. ఇప్పటికే 73 మంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు