Jammu Kashmir: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు

జమ్ము కశ్మీర్‌లో రాజౌరీలో అంతుచిక్కని రోగాలతో ఇప్పటికే 17 మంది మృతి చెందారు.45 రోజుల వ్యవధిలోనే మూడు కుటుంబాలకు చెందిన వారు మరణించారు.ఇప్పటికే రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించగా.. తాజాగా వైద్య సిబ్బందికి ఇచ్చే శీతా కాలపు సెలవులను రద్దు చేసింది

author-image
By Bhavana
New Update
jammu

jammu

Jammu Kashmir: జమ్ము కశ్మీర్ లోయలో అంతుచిక్కని మరణాలతో అక్కడి ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంతో పాటు కేంద్ర వైదారోగ్య సైతం అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. ఓవైపు అంతుచిక్కని రోగాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి ప్రత్యేక చికిత్సలు అందిస్తూనే.. మరోవైపు వారి మృతికి కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. 

Also Read: Maoist Letter on Encounter: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

ఈక్రమంలోనే రాజౌరీ జిల్లాను మెడికల్ ఎమర్జెన్సీగా ప్రకటించి.. క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే తాజాగా వైద్యులకు శీతాకాలపు సెలవులను కూడా రద్దు చేసి ప్రజాసేవలో పాలుపంచుకుంటోంది. రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు మూడు కుటుంబాలు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. భోజనాలు చేసిన వారంతా తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చేరారు. 

Also Read: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?

అందులో ఇప్పటి వరకు మొత్తంగా 17 మంది ప్రాణాలు విడిచారు. మరెంతో మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. అయితే మృతుల చావుకు గల కారణాలు తెలుసుకునేందుకు వైద్యారోగ్య శాఖ బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశంలోని అనేక ల్యాబ్‌లకు పంపించడం జరిగింది.

వైరస్ కారణం కాదని..

ఈ క్రమంలోనే వీరి చావులకు బ్యాక్టీరియా, వైరస్ కారణం కాదని ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. అలాగే వారి శరీరాల్లో విష పదార్థాలు ఉన్నట్లు కూడా తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అలాగే ఏదైనా కుట్ర కోణం ఉందా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కాపాడేందుకు అక్కడి వైద్యులంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా ఈ సమస్యలు గ్రామంలోని మరెవరికీ రాకూడదని వారందరినీ క్వారంటైన్‌కు పంపించారు. ముఖ్యంగా 17 మంది మృతికి కారణం తెలిసే వరకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. అలాగే ఎప్పుడు ఎవరికి, ఎలాంటి సమస్య వస్తుందో కూడా తెలియకపోవడంతో వైద్యలంతా అలర్ట్‌గా ఉండాలని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం రాజౌరీని మెడికల్ ఎమర్జెన్సీగా కూడా ప్రకటించింది.

అయితే ప్రస్తుతం శీతాకాలం కావడంతో.. వైద్యులకు సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వైద్య సిబ్బంది సెలవులపై ఇంటికి వెళ్తే.. ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. వారికి సెలవులను కూడా రద్దు చేశారు. రాజౌరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటర్ ప్రిన్సిపల్ డాక్టర్ అమర్జీత్ సింగ్ భాటియానే నేరుగా ఈ విషయాన్ని ప్రకటించారు. 

వైద్యులతో పాటు పారా మెడికల్ సిబ్బంది శీతా కాలపు సెలవులను రద్దు చేస్తున్నట్లు వివరించారు. అలాగే అదనపు వైద్య సిబ్బందిని డిప్యూటేషన్ మీద రాజౌరీకి పంపినట్లు కూడా స్పష్టం చేశారు.

Also Read: Interstellar Re-Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న నోలన్ మాస్టర్ పీస్ మూవీ "ఇంటర్ స్టెల్లార్"

Also Read: Chandra babu: విశాఖలో ఐటీ ఒక గేమ్ ఛేంజర్.. దావోస్ పెట్టుబడులపై చంద్రబాబు కీలక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు