/rtv/media/media_files/2025/08/19/trump-meeting-2025-08-19-06-46-17.jpg)
Trump, Zelensky, Putin
రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల ను కలపడం పెద్ద తలనొప్పిగా తయారయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు. సమావేశానికి ఇద్దరూ ఎవరికి వారు షరతులు పెట్టడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. జెలెన్ స్కీ ను కలవడానికే పుతిన్ చాలా ఆంక్షలు పెడుతున్నారు. అటువైపు జెలెన్ కూడా తగ్గేదే లేదని అంటున్నారు. అందుకే వారిద్దరినీ కలపడం నూనెలో వెనిగర్ ను కలపడం లాంటిదేనని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. నూనెలో వెనిగర్ అంత తొందరగా కలవదు. చాలా సేపు కలుపుతూనే ఉండాలి. అలాగే పుతిన్, జెలెన్ ను కలపడం కూడా చాలా కష్టం అని అంటున్నారు ట్రంప్. అందుకే పుతిన్, జెలెన్ స్కీ ద్వైపాక్షిక సమావేశానికి తాను ఉండకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
వాళ్ళతో తలనొప్పిగా ఉంది..
ఇప్పటికే ఏడు యుద్ధాలను ఆపాను అని చెప్పుకుంటున్న ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ ను ఆపడం మాత్రం కత్తి మీద సాములా ఉందని అంటున్నారు. ఈ విషయం ఇంతకు ముందే తెలుసు కానీ మరీ ఇంత కష్టపడాల్సి వస్తుందని అనుకోలేదని వాపోతున్నారు. పుతిన్ ఆంక్షల మీద ఆంక్షలు పెడుతూనే ఉన్నారు. దానికి జెలెన్ స్కీ ఒప్పుకోవడం లేదు. మధ్యలో ట్రంప్ ఎంత మధ్యవర్తిత్వం వహించినా కుదరడం లేదు. ఈ లోపు రష్యా, ఉక్రెయిన్ లు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 7వేల మంది చనిపోయారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఎలా అయినా ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు. ముందు ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అవ్వాలని..ఒక ఒప్పందానికి రావాలని ఆయన కోరుతున్నారు. ఒకవేళ ఆ చర్చలు కనుక విఫలమైతే రష్యా పై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. రష్యన్ చమురుపై 25-50 శాతం సుంకంతో సహా మరికొన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పారు.
ఆంక్షలతో విరుచుకుపడుతున్న పుతిన్
అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రష్యా కొత్త ఆంక్షలు పెట్టడమే అంటున్నారు. ఉక్రెయిన్ భద్రతా హామీలపై రష్యాకు వీటో అధికారం ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ కొత్త డిమాండ్ ను అమెరికా ముందు ఉంచారు. దాంతో పాటూ ఉక్రెయిన్‌లో దళాలను మోహరించాలనే యూరప్ సూచనను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అది విదేశీ జోక్యం అవుతుందని అన్నారు. యూరోపియన్ మిత్రదేశాలతో కలిసి రష్యా మరియు చైనా ఉక్రెయిన్ భద్రతను చూసుకుంటాయని లావ్రోవ్ చెబుతున్నారు. అలాగే ఇంతకు ముందే చెప్పినట్టు ఉక్రెయిన్ తూర్పు డాన్ బాస్ ప్రాంతాన్ని పూర్తిగా వదులుకోవాలని..నాటోలో చేరాలనే ఉద్దేశం మానుకోవాలని రష్యా అంటోంది. కానీ ఉక్రెయిన్ మాత్రం ఈ ఆంక్షలకు ఒప్పుకోవడం లేదు. ఇద్దరూ ఎక్కడా రాజీ పడేలా కనిపించడం లేదని తెలుస్తోంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్..పుతిన్, జెలెన్ స్కీల మధ్య సమావేశం అయ్యే వరకూ కామ్ ఉండాలని డిసైడ్ చేసుకున్నారని చెబుతున్నారు.
Also Read: Online Games: అమల్లోకి వచ్చిన చట్టం.. ఆన్ లైన్ మనీ గేమింగ్ బంద్