GST Rates: ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. తగ్గనున్న నిత్యావసర వస్తువుల ధరలు

ఈరోజు ఢిల్లీలో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. రెండు రోజుల పాటూ జరిగే ఈ సమావేశాల తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు బారీగా తగ్గుతాయని చెబుతున్నారు. బిస్కెట్ల నుంచి హైబ్రీడ్ కార్లు, మోటార్ సైకిళ్ళ వరకు ధరలు తగ్గనున్నాయి. 

New Update
ind

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన ఈరోజు నుంచి రెండు రోజుల పాటూ  జీఎస్టీ పన్ను రేట్ల(GST Tax Rates) లో మార్పులు చేయడమే లక్ష్యంగా సమావేశం జరగనుంది. మొత్తం ఇందులో 33 మంది పాల్గొననున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన మంత్రులూ దీనికి హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, ఏపీ నుంచి పయ్యావుల కేశవ్ పాల్గొంటున్నారు. అలాగే సీబీఈసీ ఛైర్ సర్శన్ కూడా హాజరవుతారు. ఈరోజు న్యూ ఢిల్లీలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.  

Also Read :  తక్కువ జీతమా అయినా పర్లేదు.. నెలకు రూ.1000 చొప్పున పెట్టుబడి పెడితే మీరే ధనవంతుడు!

ఓన్లీ రెండే జీఎస్టీ రేట్లు..

ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉన్న జీఎస్టీ రేట్లను కేవలం 5, 18 శాతంగా మాత్రమే ఉంచాలని ప్రతిపాదించనున్నారు. అయితే అన్నింటి మీదనా ఇదే విధంగా ఉండదని చెబుతున్నారు. కొన్ని హానికారక ఉత్పత్తులపై మాత్రం 40 శాతం రేటును విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీని వలన నిత్యావసర వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్స్, హైబ్రీడ్ కార్లు, మోటార్ సైకిల్స్ లాంటి వాటి ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. చిన్న హైబ్రిడ్ కార్లు, మోటార్‌సైకిళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించనున్నట్లు సమాచారం. అలాగే ఎస్‌యూవీ వాహనాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం జీఎస్టీని 40 శాతానికి తగ్గవచ్చని తెలుస్తోంది. ఇక ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం జీఎస్టీ తగ్గింపు వాహనాల ధరలను 6-8 శాతం వరకు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

స్వాగతించిన కంపెనీలు..

అలాగే బిస్కెట్లు, దుస్తులు లాంటి వాటి రేట్లు కూడా తగ్గుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ ప్రీమియం(health-insurance-premium) పైనా జీఎస్టీని మినహాయించనున్నట్లు చెబుతున్నారు. దీనికి కేంద్రం కూడా ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. 2017 జులై 1న జీఎస్టీ వ్యవస్థ భారత్‌లో అమల్లోకి రాగా.. ఇప్పటివరకు 55 సార్లు జీఎస్టీ మండలి సమావేశమైంది. ఇది 56వది. అయితే ఈసారి సమావేశం, అందులో తీసుకునే నిర్ణయాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి.  జీఎస్టీలో ఇవి అతి పెద్ద సంస్కరణలుగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ తగ్గే రేట్లను దీపావళి కానుకగా ఇవ్వనున్నారు.  పన్ను రేట్లను తగ్గిస్తే..ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని...వస్తువుల వినియోగం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వం కొత్త ప్రతిపాదన అమలైతే అప్పుడు 12 శాతం శ్లాబ్ వస్తువులు 5 శాతం శ్లాబులోకి చేరొచ్చు. ఇక 90 శాతం వరకు 28 శ్లాబులో ఉన్న వస్తువులు.. 18 శాతానికి వస్తాయి. కంపెనీలు కూడా ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపును స్వాగతిస్తున్నాయి. కొత్త రేట్లను ప్రజలకు బదిలీ చేస్తామని చెప్పాయి. 

Also Read: trump on India Tariffs: భారత్ ది ఏకపక్షం..సుంకాల ఉద్రిక్తతల మధ్య ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు