Donald Trump: నా ఆరోగ్యం పై వచ్చినవన్ని వదంతులే.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం సరిగా లేదని ఎక్స్ లో పలువురు పోస్టులు పెడుతున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన.. వాటన్నింటినీ ఫేక్‌ న్యూస్‌ అని ఆయన కొట్టిపారేశారు.

New Update
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం(trump health latest news) పై ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం సరిగా లేదని ఎక్స్ లో కొన్నిరోజులుగా పలువురు పోస్టులు పెడుతున్నారు. దీనికితోడు అనుకోని విషాదం ఏదైనా జరిగితే తాను పగ్గాలు స్వీకరించడానికి  సిద్ధంగా ఉన్నా అంటూ ఈనెల 27న ఓ ఇంటర్వ్యూలో  అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ట్రంప్ ఆరోగ్యంపై వార్తలు మరింత జోరందుకున్నాయి. ట్రంప్ కూడా కొన్నిరోజులుగా బాహ్య ప్రపంచానికి కనీసం కనిపించడం లేదు. ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే తన సామాజిక మాధ్యమం ట్రూత్  సోషల్(Truth Social)  ద్వారా వెల్లడిస్తున్నారు. శ్వేతసౌధం షెడ్యూల్ లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదనీ.... మరో 2రోజులు ఎలాంటి పబ్లిక్ మీటింగ్ లు లేవనీ అసలు ఏం జరుగుతోందని పలువురు నెటిజెన్లు పోస్ట్ చేశారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్టులు పెడుతున్నారని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఈ ఊహాగానాలకు ట్రంప్ తెరదించారు. వర్జీనియాలో కుటుంబ సభ్యులతో కలిసి ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ కనిపించారు.

Also Read :  భారత్ ది ఏకపక్షం..సుంకాల ఉద్రిక్తతల మధ్య ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Trump Clarifies About Health

ఈ క్రమంలో ట్రంప్‌ ఆరోగ్యంపై వస్తున్న వివరాలు మీ దృష్టికి వచ్చాయా అని తాజాగా  ఓ రిపోర్టర్‌ ట్రంప్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం ఇస్తూ ‘లేదు.. నా ఆరోగ్యంపై వదంతులు వచ్చాయని మాత్రమే విన్నాను’ అని అన్నారు. తాజాగా ఓవల్‌ ఆఫీసులో మీడియా ముందుకొచ్చిన ఆయన.. వాటన్నింటినీ ఫేక్‌ న్యూస్‌ అని ఆయన కొట్టిపారేశారు.

చాలా రోజుల తర్వాత మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చిన ట్రంప్‌ను కొంతమంది రిపోర్టర్లు ఆయన ఆరోగ్యంపై ప్రశ్నించారు. ‘ మీరు చనిపోయారని సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి.’ వాటి గురించి తెలుసా అని అడిగారు. దీనికి ట్రంప్‌ స్పందిస్తూ.. అవునా, నేను చనిపోయానని వార్తలు వస్తున్నాయా? నాకు తెలియదు అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. అవన్నీ వట్టి పుకార్లే అని క్లారిటీ ఇచ్చారు. ఈ వీకెండ్‌లో చాలా ఆరోగ్యంగా ఉన్నానని, వర్జీనియా గోల్ప్‌ క్లబ్‌లో గోల్ఫ్‌ ఆడానని చెప్పారు. అంతేకాదు ‘ట్రూత్‌’ సోషల్‌లో శనివారం నుంచి సోమవారం వరకు 90కి పైగా పోస్టులు కూడా చేశానని వివరించారు.

రెండు రోజుల పాటు తాను ఎలాంటి మీటింగ్‌లు పెట్టలేదని.. అందుకే ఇలాంటి వదంతులు వచ్చాయని పేర్కొన్నారు. గత వారంలో చాలా ప్రెస్‌మీట్‌లు పెట్టాను.. అవన్నీ సక్సెస్‌ అయ్యాయి. ఆ తర్వాత రెండు రోజుల పాటు మీటింగ్‌లు పెట్టకపోవడంతో.. ఏదో జరిగిందని అనుకున్నారని వివరించారు. ఇక గత అధ్యక్షుడు జో బైడెన్‌ను కూడా ఈ సందర్భంగా ట్రంప్‌ ప్రస్తావించారు. బైడెన్‌ అయితే నెలల తరబడి పబ్లిక్‌ మీటింగ్‌లు పెట్టకుండా ఉండేవాడని.. అయినా ఎవరూ ఆయన ఆరోగ్యం గురించి ఏమీ అనలేదని అన్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని చెప్పారు.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యం(trump health update 2025) పై వైట్‌హౌస్‌ వైద్యులు ఇప్పటికే వివరణ ఇచ్చారు. ట్రంప్‌ చేతిపై కనిపిస్తున్న మచ్చకు ఆయన తీసుకుంటున్న ఆస్పిరిన్‌ మందే కారణమని తెలిపారు. హ్యాండ్‌షేక్‌ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆయనకు ఆ మచ్చలు వస్తాయని.. అవి మళ్లీ మాయమవు తాయని పేర్కొన్నారు. ఇక క్రానిక్‌ వీనస్‌ ఇన్‌సఫీషియన్సీ (రక్తప్రసరణ సమస్య) కారణంగా ఆయనకు కాళ్ల వాపులు వచ్చాయని చెప్పారు.

Also Read: National Guards: షికాగో చాలా ప్రమాదకరంగా ఉంది..రక్షణ అవసరం..ట్రంప్

Advertisment
తాజా కథనాలు