/rtv/media/media_files/2025/01/28/0ZgvrfqmK83oumWT4s1B.jpg)
DEEPSEEK Photograph: (DEEPSEEK)
సైలెంట్‌గా అమెరికా ఆర్థిక వ్యవస్థపై చైనా దెబ్బకొట్టింది. ఏఐ టెక్నాలజీలో చాట్ జీపీటీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపుతున్న టైంలో దానికి పోటీగా చైనా దిగింది. ప్రస్తుతం రోజుల్లో టెక్నాలజీ ఎవడి దగ్గరుంటే.. వాడే బాస్. అమెరికా టెక్ సంస్థలు మైక్రోసాఫ్ట్, మెటా, గుగూల్ కూడా ఏఐ రంగంలోకి అడుగుపెట్టాయి. వీటిటిలోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ట్రండింగ్‌లోకి తెచ్చిన ఓపెన్ ఏఐ కంపెనీ అమెరికాదే. ఈరంగంలో ఎంత ముందుకెళ్తే.. ఆదేశం అంత అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్‌లో ప్రపంచాన్ని శాశించే అవకాలు కూడా ఉన్నాయి. అయితే ఏఐ రంగంలో ఇప్పటివరకు అమెరికానే టాప్.
చైనా ఫ్రీ AI సర్వీస్
అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కాంపిటీటర్‌గా చైనా స్టార్ట్‌అప్ ఓ AI మోడల్ డెవలప్ చేసింది. అదే డీప్‌సీక్ ఆర్1. ఈ చైనా AI చాట్ జీపీటీ కంటే ఫాస్ట్‌గా యాక్యురేటెండ్‌గా పని చేస్తోంది. అంతేకాదు, చాట్ జీపీటీ సర్వీస్‌కు ప్రీమియం సబ్‌క్రిబ్షన్ కూడా చెల్లించాలి. అదే డీప్‌సీక్ సర్వీస్ అయితే ఫ్రీ. ఎన్ని రోజులైనా, ఎంతసేపైనా వాడుకోవచ్చు. దీంతో మొబైల్ యూజర్లు ఎగబడి ఈ డీప్‌సీక్ ఏఐను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. డీప్‌సీక్ యాపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లో నెం.1 డౌన్‌లోడెడ్ ఫ్రీ యాప్‌గా అవతరించింది. అసలు ఏంటీ డీప్‌సీక్ ఏఐ టెక్నాలజీ..? ఎందుకింత ఫేమస్ అవుతుంది? చైనా టెక్నాలజీ అమెరికాని ఏ విధంగా దెబ్బ కొడుతుందో క్లియర్‌గా ఇప్పుడు చూద్దాం..
చైనా డీప్‌సీక్ R1 ఏఐ
చైనాలో 2023లో లియాంగ్ వెన్ ఫెంగ్ అనే వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సంస్థ డీప్‌సీక్‌ను ప్రారంభించాడు. ఆదేశ ప్రముఖ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్లతో ఓ టీమ్ ఏర్పాటు చేసి ఆర్ 1 పేరిట ఓ కొత్త ఏఐ మోడల్ ఆవిష్కరించారు. లియాంగ్ వెన్‌ఫెంగ్ డీప్‌సీక్ సృష్టించడానికి ముందు చైనాలో ఎకానమి డేటాను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగించే హెడ్జ్ ఫండ్ సంస్థకు టీమ్ లీడ్‌గా ఉన్నాడు. ఈ కంపెనీ ఓపెన్‌సోర్స్ ఏఐ మోడల్స్‌ని డెవలప్‌చేసి, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్స్‌కి అందజేసింది. వారు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్‌సీక్ ఆర్1ని వాడుకుంటున్నారు. చైనాకు సంబంధించిన సున్నితమైన తైవాన్ ఆక్రమణ, 1989 తియానన్మెన్ స్క్వేర్ నిరసనలు, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్పైనా అడిన ప్రశ్నలకు ఆలోచించి సమాధానం చెబుతోంది డీప్‌సీక్.
Also Read: వాళ్లకి రుణమాఫీ చేయొద్దు.. కేజ్రీవాల్ సంచలన డిమాండ్
డీప్‌సీక్ డౌన్‌లోడ్స్ పరపరా..
అమెరికాలోని మైక్రోసాఫ్ట్, మెటా వంటి టాప్‌సంస్థలు ఏఐ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. కానీ వారు పెట్టే సగం ఖర్చుతోనే డీప్సీక్వస్తోంది. అంతేకాదు.. ఇతర మోడల్స్‌తో పోల్చితే డీప్సీక్మ్యాథ్స్, జీకే, క్వశ్చన్ అడగ్గానేఆన్సర్ చెప్పడంలో డీప్‌సీక్ బెస్ట్ పెర్మామెన్స్ ఇంటుందని ఆ సంస్థ చెబుతోంది. దీంతో ఈ డీప్‌సీక్‌కి ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్స్ వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో యాపిల్ యాప్‌స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి, ఈ డీప్‌సీక్R1 టాప్‌లో ఉంది. డౌన్‌లోడ్స్ తాకిడిని తట్టుకోలేక యాప్ క్రాష్ కూడా అవ్వడంతో వెంటనే సర్వీస్ తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చారు. డీప్సీక్ఐఏ అసిస్ట్‌పై సైబర్‌అటాక్ కూడా జరిగింది. ఈ విషయాన్ని చైనా సంస్థ స్వయంగా ప్రకటించింది. దీని కారణంగా రిజిస్ట్రేషన్‌ని తాత్కాలికంగా లిమిట్చేస్తున్నట్టు డీప్‌సీక్ సంస్థ తెలిపింది.
Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌పై అడిగిన ప్రశ్నకు డీప్‌సీక్ షాకింగ్ ఆన్సర్..
అమెరికా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
డీప్‌సీక్ సంచలనంతో అమెరికాలోని దిగ్గజ టెక్ సంస్థల షేర్లు కుదేలవుతున్నాయి. అమెరికా నాస్‌డాక్ 3 శాతంపతనమైంది. ఆర్టిఫీషియల్ఇంటెలిజెన్స్కోసం భారీ డేటా, టెక్‌ను రూపొందించే కంపెనీ ఎన్‌విడియా సంస్థ షేర్లు 17శాతానికి పడిపోయాయి. ఒక్క ట్రేడింగ్సెషన్లోనే ఈ కంపెనీ దాదాపు 600 బిలియన్డాలర్లను కోల్పోయింది. టెక్ కంపెనీల యజమానులు, ప్రపంచంలోని అత్యంత ధనువంతుల సంపద ఏకంగా 108 బిలియన్ డాలర్లు పతనమైంది. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ 22.6 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఇది ఆయన మొత్తం సంపదలో 12 శాతం. డెల్ కంపెనీ యజమాని మైకేల్ డెల్ 13 బిలియన్ డాలర్ల నష్టాలు చవిచూశారు. బినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సహవ్యవస్థాపకుడు చాంగ్ పెంగ్ సీజడ్ జావో 12.1 బిలియన్ డాలర్ల సంపద కోల్పోయారు.