Japan Invitation : జపాన్‌కు రండి... ట్రంప్‌కు ఆహ్వానం.. ఎందుకంటే!

హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జపాన్‌ ఆహ్వానించింది. ఈమేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు

New Update
Trump Gets Japan Invite For 80th anniversary

Trump Gets Japan Invite For 80th anniversary

Japan Invitation: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)ను జపాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా అణుబాంబును జపాన్(Japan) పై ప్రయోగించిన సంగతి తెలిసిందే. జపాన్ లోని హిరోషిమా, నాగసాకి(Nagasaki)పై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమ దేశంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరు కావాల్సిందిగా కోరింది. ఈ మేరకు ఆ రెండు నగరాల మేయర్లకు ఓ లేఖను రాశారు.

Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఈ లేఖలో ట్రంప్‌ స్వయంగా అణుబాంబు బాధితుల అనుభవాలను తెలుసుకోవాలని పేర్కొంది.  శాంతి కోసం వారు పడుతున్న ఆరాటాన్ని అర్థం చేసుకోవాలని.. అణ్వాయుధాల అమానవీయతపై అవగాహన పెంచుకోవాలని కోరింది. ఈ ఆయుధాల నిషేధం దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నామని లేఖలో వెల్లడించింది.  

1945 ఆగస్టు 6, 9వ తేదీల్లో అమెరికా(America) హిరోషిమా(Heroshima), నాగసాకి నగరాలపై అణ్వాయుధాలతో దాడులు చేసింది. ఈ ఘటన కారణంగా హిరోషిమాలో 1,40,000 మంది, నాగసాకిలో 74,000 మంది చనిపోయారు. గాయలతో బయటపడిన వారు ఆ తరువాత రేడియేషన్‌ ప్రభావంతో చనిపోయారు.  ఇది జరిగిన కొద్దీరోజులకే  రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. ఇంత జరిగిన ఈ దాడులకు సంబంధించి అమెరికా ఏనాడు క్షమాపణలు చెప్పలేదు. 

Also Read:  Payal Rajput: థై స్లిట్ బాటమ్ లో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ.. పాయల్ ఫొటోలు చూస్తే అంతే!

తొలి అమెరికా అధ్యక్షుడిగా ఒబామా

అయితే 2010లో తొలిసారిగా అమెరికా రాయబారి జాన్‌రూస్‌  హిరోషిమాలో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  రెండు సంవత్సరాల తర్వాత నాగసాకి ఈవెంట్‌కు వెళ్ళారాయన. 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హిరోషిమాను విసిట్ చేశారు. దీంతో ఆ ప్రాంతానికి వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచారు. ఆ తరువాత 2023లో జోబైడెన్‌  ఈ ప్రాంతంలో పర్యటించారు. జపాన్ మీడియా ప్రకారం ఇద్దరు మేయర్లు ఆయనను ఆహ్వానించినప్పటికీ, ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో పర్యటన చేయలేదు. మరి ఇప్పుడైనా వెళ్తరా లేదా అన్నది చూడాలి.  

Also Read :  షకలక బూంబూం ఆట మిగిల్చిన విషాదం.. 6ఏళ్ల చిన్నారి మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు