Donald Trump: దేశం విడిచి వెళ్లిపోతే భారీగా డబ్బులు.. వలసదారులకు ట్రంప్‌ బంపర్ ఆఫర్

ట్రంప్ యంత్రాంగం వలసదారులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. అమెరికాను స్వచ్ఛందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు చెల్లిస్తామని పేర్కొంది. అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

New Update
Trump administration offers unaccompanied migrant children 2,500 dollars to voluntarily leave US

Trump administration offers unaccompanied migrant children 2,500 dollars to voluntarily leave US

ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లని దేశం నుంచి పంపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ యంత్రాంగం వలసదారులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. అమెరికాను స్వచ్ఛందంగా వదలి వెళ్లిపోయేవారికి 2500 డాలర్లు (రూ.2 లక్షల 21 వేలు) చెల్లిస్తామని పేర్కొంది. అమెరికా ఇమిగ్రేషన్(immigration), కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 14 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసున్న వాళ్లకు ఈ ఆఫర్‌ ఉంటుందని పేర్కొంది. 

Also Read: నీరవ్‌ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌కు అప్పగింత

Trump Administration Offers Unaccompanied Migrant Children

దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లేవారికి 2500 డాలర్లు ఇస్తామని తెలిపింది. అంతేకాదు దీనిపై స్పందించేందుకు వాళ్లకు 24 గంటల సమయం ఇచ్చినట్లు సమాచారం. మరీ ఈ ఆఫర్‌ ఎప్పటినుంచి ఉంటుంది అనేది క్లారిటీ లేదు. అయితే ఆ ఆఫర్‌ను ముందుగా 17 ఏళ్ల పిల్లల నుంచి ప్రారంభిస్తామని అధికారులు చెప్పినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.  

Also Read: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల

మరోవైపు ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన ఈ ఆఫర్‌ను ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఖండించారు. ఇది క్రూరమైన చర్యగా అభివర్ణించారు. పిల్లల రక్షణ చట్టాలను ఇది బలహీనపరుస్తుందని ఆరోపిస్తున్నారు. ఇది వాళ్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తాయని అంటున్నారు. ఇదిలాఉండగా 2021 అక్టోబర్ నుంచి తల్లిదండ్రులు లేకుండానే 4 లక్షలకు పైగా పిల్లలు తల్లిదండ్రులు లేకుండానే సరిహద్దులు దాటారు. వాళ్లందరినీ అమెరికా బోర్డర్ అధికారులు అరెస్టు చేశారు. అయితే 2008 చట్టం ప్రకారం వలసదారులను స్వదేశాలకు పంపించే ముందు ఇమిగ్రేషన్ న్యాయమూర్తి ముందు వాళ్లని హాజరుపర్చాల్సి ఉంటుంది. కానీ ట్రంప్ యంత్రాంగం ఇవేమి పట్టించుకోకుండా వలసదారులను స్వచ్ఛందంగా వెళ్లిపోయేలా చేసేందుకు ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: షట్ డౌన్ మరింత తీవ్రతరం.. డెమోక్రాట్ రాష్టాలకు నిధులు నిలిపేసిన ట్రంప్

Advertisment
తాజా కథనాలు