Nirav Modi: నీరవ్‌ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్‌కు అప్పగింత

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

New Update
Nirav Modi

Nirav Modi

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్లు మోసం చేసి అతడు బ్రిటన్‌కు పారిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. నీరవ్‌ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అతడిని అప్పగించే ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీపత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.  

Also Read: రక్షిత్ శెట్టితో రష్మికకు ఎందుకు బ్రేకప్ అయ్యిందో తెలుసా?

నీరవ్ మోదీని ఇండియాకు తీసుకొచ్చాక కేవలం మనీలాండరింగ్, బ్యాంకుల మోసం కేసుల్లో మాత్రమే విచారిస్తామని.. ఇతర ఏజెన్సీలకు సంబంధించి ఎలాంటి కస్టడీకి ఇవ్వమని ఆ హామీ పత్రంలో భారత్ పేర్కొన్నట్లు సమాచారం. CBI, ED, ఆదాయపు పన్ను విభాగం, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌, కస్టమ్స్‌ కలిసి ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు పలు కథనాలు వచ్చాయి. అంతేకాదు నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించిన అనంతరం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్ జైల్లో ఉంచుతామని చెప్పారని.. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

Also Read: పాకిస్తాన్ సైన్య గౌరవం POKలో వేలం.. యూనిఫాంల నుండి హెల్మెట్ల వరకు ప్రతిదీ రూ. 10

మరోవైపు తనను భారత్‌కు అప్పగించే ప్రక్రియను సవాల్‌ చేస్తూ నీరవ్ మోదీ ఇటీవల మరోసారి లండన్ కోర్టులో పిటిషన్ వేశారు. తనను అప్పగిస్తే దేశంలో దర్యాప్తుల పేరుతో చిత్ర హింసలకు గురిచేస్తారని అందులో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని మళ్లీ ప్రారంభించాలని కోరాడు. ఈ పిటిషన్‌ను లండన్‌ కోర్టు అంగీకరించడంతో భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. కోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే నవంబర్ 23న అతడిని భారత్‌కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

Also Read: షట్ డౌన్ మరింత తీవ్రతరం.. డెమోక్రాట్ రాష్టాలకు నిధులు నిలిపేసిన ట్రంప్

2018లో నీరవ్ మోదీ తప్పుడు LOUలతో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13 రూ.వేల కోట్లు ఎగవేసిన వ్యవహారం బయటపడింది. దీంతో ఈ స్కామ్‌పై ఈడీ, సీబీఐ విచారణను  ప్రారంభించాయి. అప్పటికే అతడు యూకేకు పారిపోయాడు. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అతడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. అయితే 2018 డిసెంబర్‌లో నీరవ్‌ తమ దేశంలో ఉంటున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు చెప్పింది. దీంతో అతడిని తమ దేశానికి అప్పగించాలంటూ భారత్‌ కోరింది. 2019 మార్చిలో నీరవ్‌ను అక్కడున్న పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడిని భారత్‌కు అప్పగించేందుకు 2-021లో అప్పటి బ్రిటన్ హోంమంత్రి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ అతడు లండన్‌ కోర్టులో అప్పీల్‌ చేయగా కోర్టు రిజెక్ట్ చేసింది. 

Also Read: అమెరికాకు నో చెబుతున్న భారత విద్యార్థులు..జూలై-ఆగస్టులో 50శాతం తగ్గుదల

Advertisment
తాజా కథనాలు