US JOBS-Trump: 2 వేల మంది యూఎస్ ఎయిడ్‌ ఉద్యోగులను పీకి పారేసిన ట్రంప్‌!

తాజాగా 2 వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వేటు వేశారు.వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది.

New Update
Donald Trump

Donald Trump

అంతర్జాతీయ అభివృద్ది కార్యక్రమాలకు , మానవతా దృష్టితో సహాయానికి యూఎస్‌ ఎయిడ్‌ సంస్థ ద్వారా అందుతున్న నిధులను అమెరికా ప్రభుత్వం ఆపివేసిన విషయం తెలిసిందే. తాజాగా 2 వేల మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగుల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వేటు వేశారు. మిగిలిన వారిలో కొంతమందిని మినహాయించి వేల మంది ఉద్యోగులకు బలవంతపు సెలవులు ఇచ్చినట్లు  యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ వెబ్‌ సైట్‌ లోని నోటీసు ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపునకు ఫెడరల్‌ జడ్జి అనుమతించిన తర్వాతే ట్రంప్‌ యంత్రాంగం ఈ విషయంలో ముందుకెళ్లారు.

Also Read: Telangana:టికెట్‌ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్‌ ట్యాక్స్‌!

ప్రభుత్వ ప్రణాళికను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరిన ఉద్యోగుల విజ్ఙప్తిని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కార్ల్‌ నికోలస్ తిరస్కరించారు. ప్రభుత్వంచేసే అనవసరపు ఖర్చులను తగ్గించడానికి పని చేస్తున్న మస్క్‌ నేతృత్వంలోని డోజ్‌ ఇప్పటికే అనేక మంది యూఎస్‌ ఎయిడ్‌ ఉద్యోగుల పై వేటు వేసిన విషయం తెలిసిందే.

Also Read: Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అయితే యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, అది నేరగాళ్ల సంస్థ అని మస్క్‌ ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే నిధులను ఆపేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది.

భవనంలోకి వెళ్లనీయకుండా..

ఇందులో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లనీయకుండా నిలిపివేశారు.ఈ ఆదేశాల పై ఫెడరల్‌ జడ్జి అమీర్‌ అలీ గతవారం తాత్కాలికంగా స్టే ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా సాయం అందించడానికి ఆమోదం తెలిపినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎలా నిలిపేయగలదని జడ్జి నిలదీశారు.

అయినా ట్రంప్‌ తన చర్యలను సమర్ధించుకుంటున్నారు. యూఎస్‌ ఎయిడ్‌ ద్వారా భారత్‌ లో జరిగిన ఎన్నికల్లో పోలంగ్‌ శాతం పెంచడానికి అమెరికా ప్రభుత్వం రూ.182 కోట్లు ఇచ్చిందని ట్రంప్‌ పలుమార్లు ఆరోపించారు. ఇక పై అటువంటి నిధులను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో అధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్‌ వద్ద చాలా డబ్బు ఉందని, ఆ దేశానికి తామెందుకు నిధులు ఇవ్వాలని ప్రశ్నించారు.

దీంతో ఈ విషయం పై ఇరు దేశాల మధ్య  భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Also Read: Anushka Sarma: కోహ్లీ సూపర్‌ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!

Also Read: Musk: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్‌ చేయాలన్న మస్క్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు