/rtv/media/media_files/2025/02/24/Kj4wi9LUdf9yCUXh9szD.jpg)
kohli
ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది పాకిస్తాన్ ను భారత్ మట్టికరిపించింది.ఆదివారం జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గి సెమీస్ బెర్తును దాదాపు ఫిక్స్ చేసుకుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ..నిన్నటి మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో శతకం సాధించడంతో అభిమానులు జోష్ లో ఉన్నారు.
సెంచరీ సంబరాలను...
కింగ్ సెంచరీ పై ఆనందం వ్యక్తం చేస్తూ అతడి సతీమణి, నటి అనుష్క శర్మ ఇన్ స్టా స్టోరీస్ లో ఫొటోను పంచుకుంది. ఈ మ్యాచ్ ను ఇంటి నుంచి వీక్షించిన అనుష్క..టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది. దానికి లవ్, హైఫై, ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని పంచుకుంది. అంతకుముందు శతకం సాధించడంతో కోహ్లీ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్ ను ముద్దు పెట్టుకున్నాడు.
/rtv/media/media_files/2025/02/24/5nLVocKzdx3tfUzIll7S.jpeg)
అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విజయసంకేతం చూపించాడు. ప్రస్తుతం అనుష్క పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా విరాక్ కోహ్లీ సంచలనం సృష్టించాడు. 111 బంతుల్లో సెంచరీ(100*) చేసి టీమిండియాను గెలిపించాడు. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 241 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.
వన్డేల్లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు. సచిన్ టెండుల్కర్, సంగక్కరల రికార్డులను బ్రేక్ చేశాడు విరాట్. విరాట్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు.