Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు ఆదివారం బెదిరింపు ఫోన్‌ కాల్స వచ్చాయి.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
raja singh MLA

raja singh MLA

'ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తాం' అంటూ గుర్తు తెలియని వ్యక్తులు రెండుసార్లు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ చేసినట్లు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వెల్లడించారు. తనకు, తన కుటుంబానికి తీవ్రవాద శక్తులతో ప్రాణహాని ఉందని ఏడాది క్రితమే ఐబీ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినా, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించడంలో అధికారులు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని రాజా సింగ్‌ ఆరోపించారు.

Also Read:  Anushka Sarma: కోహ్లీ సూపర్‌ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే!

ఆదివారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 3:30కు, సాయంత్రం 4 గంటలకు రెండు సార్లు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరించారన్నారు. తనకు వివిధ దేశాల నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్‌పై ఇంత వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. 

Also Read: Musk: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్‌ చేయాలన్న మస్క్‌!

గత కొన్ని నెలల నుంచి ఇలాంటి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని రాజాసింగ్‌ వెల్లడించారు. హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకొని పని చేస్తున్న తనపై తీవ్రవాద శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్నారు. ప్రాణానికి హాని ఉందని తెలిసినా రక్షణ కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం పోరాడతానని తెలిపారు.

రెచ్చగొట్టేలా పెట్టిన పోస్టులే...

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం రాజా సింగ్‌కు మెటా సంస్థ షాకిచ్చింది. ఎమ్మెల్యే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను బ్లాక్ చేసింది. ఆయన పేరుతో ఉన్న రెండు ఫేస్‌బుక్ పేజీలు, మూడు ఇన్‌స్టా అకౌంట్లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన రెచ్చగొట్టేలా పెట్టిన కొన్ని పోస్టులే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిర్యాదుతోనే ఈ చర్యలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్‌షిప్ దాడి చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, స్నేహితులు, మద్దతుదారుల అకౌంట్లను బ్లాక్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజాసింగ్ ఎక్స్ లో స్పందించారు.

‘హిందువులను లక్ష్యంగా చేసుకొని సెలెక్టివ్‌ సెన్సార్‌షిప్‌ దాడి చేస్తోంది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సామాజిక మాధ్యమాల ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేయడం చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగింది’ అని రాజాసింగ్ మండిపడ్డారు. 

కాగా, రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంపై రాజాసింగ్ తీవ్రంగా మండిపడ్డారు. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం .4 గంటలకే తమ ఇళ్లకు వెళ్లేలా అనుమతిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోను విడుదల చేసి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఆంక్షలు విధించి.. నవరాత్రుల్లో పాల్గొన్న హిందూ ఉద్యోగులపై కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ముస్లింలకు పని గంటల సమయానికంటే ముందే వెళ్లడానికి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హిందువుల ఓట్లతో గెలవలేదా? కేవలం ముస్లింల ఓట్లతోనే గెలిచిందా? నిలదీశారు. ఇదిలా ఉండగా.. తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజాసింగ్ వార్తల్లో నిలుస్తారు. జిల్లా అధ్యక్షుడిగా తాను సూచించిన వ్యక్తికి కాకుండా ఎంఐఎంతో అంటకాగే వారికి ఇచ్చారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఆయనకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!

Also Read: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు