Telangana:టికెట్‌ పై లేకపోయినా సరే..కట్టాల్సిందే ..ఎలక్ట్రిక్ బస్సులో గ్రీన్‌ ట్యాక్స్‌!

తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్నారు. టికెట్‌పై ముద్రించకుండానే.. బస్సులను బట్టి రూ.10, రూ.20 అదనంగా ఛార్జ్‌ చేస్తున్నారు.

New Update
evbuses

evbuses

తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మీ ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి రావటంతో బస్సుల్లో రద్దీ  విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ప్రస్తుతం ఆ సంఖ్య దానికి డబుల్ అంటే 60 లక్షలకు చేరుకుంది. అందుకు తగ్గట్లుగానే ఆర్టీసీ అధికారులు కొత్త బస్సుల కొనుగోళ్లు చేస్తున్నారు. ఆర్టీసీ యాజమాన్యం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించింది. పర్యావరణాన్ని రక్షించటం, ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Also Read: Musk: గడిచిన వారం రోజుల్లో ఎవరెవరు ఏం పని చేశారు..మెయిల్‌ చేయాలన్న మస్క్‌!

అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో గ్రీన్‌ ట్యాక్స్‌ పేరుతో టికెట్‌పై అదనపు ఛార్జీ వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రయాణికులకు తెలియకుండానే టికెట్‌పై ఎక్స్‌డ్రా డబ్బులు తీసుకుంటున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అయితే రూ.10, మిగతా వాటిల్లో రూ.20 చొప్పున అదనంగా గ్రీన్ ట్యాక్ ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Also Read: Raja Singh:రేపు అయినా నీ తల నరికేస్తాం....రాజాసింగ్‌ కు బెదిరింపు ఫోన్లు!

ట్యాక్స్ పేరుతో అదనంగా వసూలు చేస్తున్న ఛార్జీలను టికెట్‌పై ప్రింట్ చేయటం లేదు. బస్సుల్లో రెగ్యూలర్‌గా ప్రయాణించే వారికి మాత్రమే ఈ అదనపు ఛార్జీ గురించి అవగాహన వస్తుంది. ఎప్పుడో ప్రయాణించే వారు ఏమాత్రం గుర్తించలేదు. దీంతో చెప్పకుండా ఎందుకు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు ప్రయాణికులు కండక్టర్లతో గొడవకు దిగుతున్నారు.

గతంలో టికెట్‌పై బస్‌ ఛార్జీలతోపాటుగా సెస్ ఛార్జులు, టోల్‌గేట్ ఛార్జీల వివరాలను ముద్రించేవారు. ప్రస్తుతం వరంగల్ రీజియన్‌లో 74 ఎలక్ట్రిక్‌ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుంది. హైదరాబాద్‌ రూట్లలో డీజిల్‌ బస్సులను సగానికి తగ్గించి వీటిని రన్ చేస్తున్నారు. మెుత్తం 74 బస్సుల్లో 19 డీలక్స్, 34 ఎక్స్‌ప్రెస్, 21 సూపర్‌ లగ్జరీ బస్సులు ఉన్నట్లు సమాచారం.

ఈ బస్సుల్లో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్‌ బస్సుకు రూ.260 ఛార్జీ కాగా...రూ.280 వసూలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు రూ.200 అయితే రూ.210, సూపర్‌ లగ్జరీ బస్సులకు రూ.300 అయితే రూ.320 ఛార్జ్‌ చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ బస్సుల్లో టికెట్‌పై గ్రీన్‌ ట్యాక్స్‌ అదనంగా పడుతుందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోందన్నారు. అయితే టికెట్‌పై ప్రింట్ చేయకుండా డబ్బులు వసూలు చేయటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఇది అన్యాయం సార్' అని కండక్టర్ల వద్ద వాపోతున్నారు. 

Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!

Also Read: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనీర్ కుమార్తె

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు