/rtv/media/media_files/2024/12/30/yiLRrQpSNSA8gXfSAVVY.jpg)
suchir
SUCHIR-MUSK : చాట్ జీపీటి మాతృ సంస్థ ఓపెన్ ఏఐ సమాజానికి హాని కలిగిస్తోందని గతంలో విమర్శలు చేసిన ప్రజా వేగు సుచిర్ బాలాజీ (26) హఠాత్తుగా మరణించడం టెక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని మృతి పై కుటుంబ సభ్యులు అనుమానాఉల వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.
Also Read: UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు!
Elon Musk On Suchir Balaji Death
అతడిది ఆత్మహత్యలా అనిపించడం లేదన్నారు. సుచిర్ బాలాజీ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్‌మెంట్ లో నవంబర్ 26న ఆయన చనిపోయి ఉన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం..పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్థారించారు.అయితే తన కుమారుడి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలాజీ తల్లి పూర్ణిమారావ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
Also Read: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. నాగార్జున రియాక్షన్ ఇదే
తాము ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ను నియమించుకుని రెండోసారి శవపరీక్ష చేశామని ఆమె తెలిపారు. ఆ పరీక్ష ఫలితాలను పోలీసులు చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాయని వెల్లడించారు.సుచిర్ అపార్ట్ మెంట్ ను ఎవరో దోచుకున్నట్లు కన్పిస్తోంది.బాత్ రూమ్ లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి.
Also Read: China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్‌పింగ్!
రక్తపు మరకలు కన్పించాయి. ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చిచెప్పారు. మాకు న్యాయం జరగాలి.దీని పై ఎఫ్‌బీఐతో దర్యాప్తు జరిపించాలని పూర్ణిమ కోరారు. ఈ పోస్ట్ ను మస్క్ , భారత సంతతి నేత వివేక్ రామస్వామి, భారత విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు.దీని పై మస్క్ స్పందిస్తూ అది ఆత్మహత్యలా అనిపించడం లేదన్నారు.
Also Read: Bullet Train: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ
భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పరిశోధకుడిగా పని చేశారు. ఈ ఏడాది ఆగస్టులో తన ఉద్యోగానికి రాజీనామా చేశారుఆ సందర్భంగా సమాజానికి ప్రయోజనం కంటే హాని కలిగించే సాంకేతికతల అభివృద్ది కోసం తాను పని చేయాలని అనుకోవడం లేదన్నారు.చాట్‌జీపీటీ అభివృద్ది సమయంలో సంస్థ కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించారు.
అక్టోబర్ లో న్యూయార్క్ టైమ్స్ తో బాలాజీ మాట్లాడుతూ..వ్యక్తుల , వ్యాపార సంస్థల రాబడి అవకాశాలను చాట్ జీపీటీ ,ఇతర చాట్ బాట్ లు ధ్వంసం చేస్తున్నాయి అని చెప్పారు.2022 లో కాపీరైట్ ఉల్లంఘనలకు సంబంధించి అనేక వ్యాజ్యాలు ఓపెన్ ఏఐపై నమోదయ్యాయి.ఈ కేసులో బాలాజీ సాక్ష్యం కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం చాలా అనుమానాలను రేకెత్తిస్తోంది.
Follow Us