ఆదివారం జరిగిన మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమాకు ఏఎన్నార్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ప్రధాని ఇలా కొనియాడడంతో నాగార్జున తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. తన తండ్రిని ప్రశంసించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు చేశారు. '' ఐకానిక్ లెజెండ్స్ సరసన ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా గౌరవించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఏఎన్నర్ దూరదృష్టి, భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతారలకు స్పూర్తినిస్తూనే ఉంటుందని' నాగార్జున రాసుకొచ్చారు.
Also Read: నన్ను క్షమించండి.. స్టార్ హీరో సంచలన ప్రకటన, షాక్ లో ఫ్యాన్స్?
ఇదిలాఉండగా మన్‌కీ బాత్ కార్యక్రమం 117వ ఎపిసోడ్‌లో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని ప్రశంసించారు. తెలుగు సినిమాను నాగేశ్వర్ రావు మరో స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. ఆయన సినిమాల్లో భారతీయ సంప్రదాయాలు, విలువలను చాలా బాగా చూపించేవారని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా మూవీస్ కూడా సమజానికి కొత్త బాటలు వేశాయని చెప్పారు. ఇక రాజ్‌కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలో సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశాయని తెలిపారు.
Also read: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ
ఇండియన్ మూవీస్ వైపు ఇప్పుడు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని.. తొలిసారిగా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్‌ను వచ్చే ఏడాది భారత్‌లోనే నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ సమ్మిట్‌లో సినిమా ఇండస్ట్రీ, మీడియా రంగాలకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు ఇందులో పాల్గొంటారని తెలిపారు.
Also Read: ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు వీళ్ళే!
Also Read: 60 శాతం పాకిస్థాన్ తీవ్రవాదుల్ని హతం చేశాం: ఇండియన్ ఆర్మీ