PM Modi : ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ
ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా పర్యటనలో భాగంగా జీ7 సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాం ఉగ్ర దాడి.. మానవత్వంపై జరిగిన దాడి. ఇది భారతీయుల గౌరవం, గుర్తింపుపై జరిగిన దాడి. దీన్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.