Prashant Kishor : రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

తేజస్వీ యాదవ్ తన సొంత నియోజకవర్గమైన రాఘోపూర్‌లో పోటీ చేస్తే, ఆయనకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అమేథీలో ఎదురైన చేదు అనుభవమే ఎదురవుతుందని పీకే హెచ్చరించారు.

New Update
rahul

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ యాదవ్ తన సొంత నియోజకవర్గమైన రాఘోపూర్‌లో పోటీ చేస్తే, ఆయనకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అమేథీలో ఎదురైన చేదు అనుభవమే ఎదురవుతుందని పీకే హెచ్చరించారు. తాను జన్ సురాజ్ తరఫున రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగితే, తేజస్వీ యాదవ్ రెండు సీట్లలో పోటీ చేయాల్సి వస్తుందని పీకే స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగానే రాహుల్ గాంధీ అమేథీ ఓటమిని ఉదహరించారు. "నేను రాఘోపూర్ నుంచి పోటీ చేస్తే, రాహుల్ గాంధీకి అమేథీలో ఎదురైన పరిస్థితే తేజస్వీ యాదవ్‌కు ఎదురవుతుంది" అని ప్రశాంత్ కిషోర్ విలేకరులతో అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీ లోక్‌సభ స్థానంలో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలైన విషయాన్ని పీకే ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాఘోపూర్ కూడా తేజస్వీ యాదవ్ కుటుంబానికి (లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి ప్రాతినిధ్యం వహించిన స్థానం) బలమైన పట్టున్న నియోజకవర్గం. అలాంటి స్థానంలోనే తేజస్వీ పరాజయం పాలవుతారని పీకే అంచనా వేశారు. 

తేజస్వీని రెండుసార్లు గెలిపించినా

రాఘోపూర్ ప్రజలు తేజస్వీని రెండుసార్లు గెలిపించినా, ఈ ప్రాంతంలో ఇప్పటికీ మౌలిక వసతులు లేవని పీకే ఆరోపించారు. "ప్రజలు కష్టాల్లో ఉన్నప్పటికీ తేజస్వీ పట్టించుకోవడం లేదు. అందుకే ఆయన భయపడుతున్నారు. ఆ ఒక్క కుటుంబ ఆధిపత్యాన్ని అంతం చేయాలనుకుంటున్న ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నేను రాఘోపూర్ వెళ్తున్నాను," అని పీకే విమర్శించారు. మొత్తంగా, బీహార్ రాజకీయాల్లో పీకే సవాళ్లు తేజస్వీ యాదవ్‌కు ఒక కొత్త తలనొప్పిగా మారాయి.

Advertisment
తాజా కథనాలు