MLC పై బీదా రవిచంద్ర ఫస్ట్ రియాక్షన్ | Beeda Ravichandra Yadav First Reaction On MLC Election | RTV
మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. తాను లేని 4,5 రోజుల్లోనే గొడవలు జరిగిపోయాయన్నారు. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని వివరణ ఇచ్చారు. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు.
AP: ఎన్డీయేకు మద్దతుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్డీయే కూటమిలో ఉన్నట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావడానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. దీంట్లో ఎలాంటి అనుమాలు లేవని స్పష్టం చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద ప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ తెలిపారు. ఈ రేవ్ పార్టీలో ఇద్దరు సినీ నటులు కూడా దొరికినట్లు సీపీ వివరించారు.
మహిళలు బిందెలు పట్టుకోని నీళ్లకోసం తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సర్కార్ ను నిలదీశారు కేసీఆర్ . నీటి కోతలు ఎందుకు షురూ అయ్యాయంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా అకౌంట్స్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పుడు నడిరోడ్డు మీద నిలబడ్డామని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అకౌంట్లు సీజ్ చేయడంతో కనీసం రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామన్నారు.ఎన్నికల ప్రచారానికి రైల్లో కూడా వెళ్ళలేని పరిస్థితని వివరించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అన్న మాటల్లా వాస్తవం లేదని కొట్టిపారేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని చాలా సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. తమకు అధికారమిస్తే చిత్తశుద్దితో పనిచేస్తామని కాంగ్రెస్ అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు.