/rtv/media/media_files/2025/10/15/amazon-2025-10-15-17-20-14.jpg)
Amazon plans major layoffs, up to 15 per cent of HR staff and more could be fired
ఈ మధ్య ఐటీ రంగంలో లేఆఫ్‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ ఖర్చులు తగ్గించుకునేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ లాంటి అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇకామార్స్ సంస్థ అయిన అమెజాన్ మళ్లీ ఉద్యోగులపై వేటు వేయనుంది. మానవ వనరుల (HR) విభాగంలో 15 శాతం సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ కంపెనీ వెల్లడించినట్లు ఫార్చ్యూన్ అనే పత్రిక తన కథనంలో తెలిపింది.
Also Read: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్ శాటిలైట్స్.. శాస్త్రవేత్తలు ఆందోళన
దీని ప్రకారం అమెజాన్‌లో తాజా లేఆఫ్‌లు HR విభాగంలో అత్యధికంగా ఉండనుంది. ఈ ఉద్యోగ కోతలు ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై కూడా ప్రభావం పడనుంది. అయితే ఈ లేఆఫ్‌లు ఎప్పటినుంచి ఉంటాయి, ఎంతమందిని తొలగిస్తారనేది తెలియాల్సి ఉంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ ఈ లేఆఫ్స్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
#Amazon is planning to cut human resources staff by 15%, Fortune reported, citing sources. Core consumer business will probably to be affected by the move.
— NDTV Profit (@NDTVProfitIndia) October 15, 2025
Read more: https://t.co/zsYRYECeAFpic.twitter.com/svoyUlvJwf
Also Read: ఆర్‌జేడీలో ముసలం..అభ్యర్థులకు టికెట్లిచ్చిన లాలూ.. వెనక్కి తీసుకున్న తేజస్వి..
అమెజాన్ CEO యాండీ జెస్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. 2022-23లో 27 వేల ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోందని.. ప్రతి ఉద్యోగి ఏఐ సామార్థ్యాలు పెంచుకోవాలన్నారు. తమ కంపెనీలో ఏఐని మరింత విస్తరింపజేయడం వల్ల ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని పేర్కొన్నారు. మరోవైపు అమెజాన్ లేఆఫ్‌లు ప్రకటిస్తూనే.. సీజనల్ ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పండుగల సీజన్ దృష్ట్యా యూఎస్ గిడ్డంగులు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో 2,50,000 మంది సీజనల్ ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమవుతోంది.
Also read: దీపావళికి టపాసులు పేలుస్తున్నారా ?.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఇదిలాఉండగా ఏఐని అందిపుచ్చుకోవడంతో సహా క్లౌడ్ కార్యకలాపాల కోసం అమెజాన్ సంస్థ బిలియన్ల డాలర్లు కేటాయిస్తోంది. ఈ ఏడాది మూలధన పెట్టుబడుల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎక్కువ భాగం తర్వాతి తరం డేటా సెంటర్‌లను నిర్మించేందుకు కేటాయించింది.