USA: మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా..

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్‌ ఏంజెల్స్‌తో పాటు నార్త్‌ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

New Update
Mass Shooting in USA

Mass Shooting in USA

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లాస్‌ ఏంజెల్స్‌తో పాటు నార్త్‌ కరోలినాలోని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కొలరాడోలో యూదులపై ఓ వ్యక్తి బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. నార్త్‌ కరోలినాలోని హికోరిలో ఓ ప్రైవేట్ ప్రాపర్టీలో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 11 మంది గాయపడ్డారు.  

Also Read: ఓరెయ్ దరిద్రుడా.. భార్యతో బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించి

Shootings In Virginia - California - North Carolina

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాదాపు 100 మంది గుమికూడిన ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి 12.45 గంటలకు కాల్పులు జరిగినట్లు కాటవ్బా కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం వెల్లడించింది. 80కి పైగా కాల్పుల శబ్దాలు వినిపించినట్లు పేర్కొంది. ఈ ఘటనలో ఒకరి కంటే ఎక్కువమంది షూటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక వర్జీనియాలోని డాన్ విల్లేలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. వీళ్లలో ఐదుగురికి గాయాలయ్యాయి.

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

అలాగే లాస్‌ ఏంజెల్స్‌లోని  బాల్డివన్‌ పార్కులో గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులకు దిగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. ఆ తర్వాత అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు. ఇక కొలరాడోలో ఓ వ్యక్తి పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ యూదులపై బాంబు దాడి చేశాడు. ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు. పాలస్తీనాకు విమక్తి కల్పించాలని అతడు నినాదాలు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడు మహమ్మద్‌ సబ్రీ సోలిమానును అదుపులోకి తీసుకున్నారు. FBI డైరెక్టర్‌ కాష్ పటేల్ ఈ ఘటన ఉగ్రదాడి అన్నారు. 

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

Also Read: బంగ్లాదేశ్‌ కొత్త కరెన్సీ నోట్లపై హిందూ, బౌద్ధ ఆలయాలు

usa | telugu-news | rtv-news | attack-in-usa | mass-shooting-at-california | mass-shooting | mass shootings usa

Advertisment
Advertisment
తాజా కథనాలు