Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ మధ్య కీలక ఒప్పందం.. భారత్‌కు ముప్పు ఉంటుందా ?

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియాపై ఒప్పందం కుదరగా దానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఓవర్గం దీన్ని నాటో లాంటి ఒప్పందంతో పోలుస్తున్నారు. మరికొందరు భారత్‌-పాక్‌తో లింక్ చేస్తున్నారు.

New Update
Saudi-Arabia-Pakistan-defence-deal

Saudi-Arabia-Pakistan-defence-deal

ఇటీవల పాకిస్థాన్, సౌదీ అరేబియా(saudi-arabia) పై ఒప్పందం కుదరగా దానిపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఓవర్గం దీన్ని నాటో లాంటి ఒప్పందంతో పోలుస్తున్నారు. మరికొందరు భారత్‌-పాక్‌తో లింక్ చేస్తున్నారు. నాటో అనేది యురోపియన్ మిత్రదేశాల సంస్థ. ఒక దేశంపై దాడి జరిగితే అన్న దేశాలు పోరాడుతాయి. అలాగే పాక్‌, సౌదీ అరేబియా నాటో లాంటి ఒప్పందం కుదుర్చుకున్నాయని పలువురు భావిస్తున్నారు. దీంతో సౌదీ అరేబియా భారత్‌కు వ్యతిరేకం కానుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

Also Read: భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

Saudi Arabia-Pakistan Defence Deal

గత నాటో లాంటి ఒప్పందాలు అనేక యుద్ధాలను అనేక యుద్ధాలను ఆపాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య జరిగిన ఒప్పందం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇప్పటికే సౌదీ అరేబియా, అమెరికా మధ్య మంచి వాణిజ్య సంబంధాలున్నాయి. కాబట్టి సౌదీ అరేబియాకు ఒప్పందం ఎందుకు అవసరమనేది చర్చనీయం అవుతోంది. ఖతర్‌ కూడా అమెరికాకు భాగస్వామిగా ఉంది. సౌదీ అరేబియా లాగే బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. అంతేకాదు అమెరికా ఆదేశం మేరకు ఖతార్‌ కూడా హమాస్‌ నాయకులతో చర్చలకు సాయం చేస్తోంది. 

Also Read: దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

ఇటీవల ఇజ్రాయెల్ కూడా ఖతార్‌ రాజధానిల దాడులు చేసిన సంగతి తెలిసిందే. హమాస్‌ సభ్యులు ఎక్కడున్నా వాళ్లని అంతం చేస్తామంటూ మరోసారి హెచ్చరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ ఒక ఒప్పందానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సౌదీ అరేబియాకు ఇప్పటికే 2 లక్షల 50 వేల మంది సైనిక బలం ఉంది. పాక్‌లో 6 లక్షలు మంది సైనికులు ఉన్నారు.  అయితే సౌదీ అరేబియాకు సైనికులను అందించడం కన్నా అణు బాంబులను ప్రదర్శించడం పైనే ఆసక్తి ఉంది. ఈ ఒప్పందం పాకిస్థాన్‌ను కిరాయి సైనికుడిగా నియమించుకున్నట్లే ఉందని నిపుణులు అంటున్నారు. 

Also Read: గాజాలో కాల్పుల విరమణ తీర్మానం.. అడ్డుకున్న అమెరికా

సౌదీ అరేబియాతో భారత్‌కు వాణిజ్య సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. భారత్‌.. పాక్ కన్నా 4 బిలియన్ డాలర్లు ఎక్కువ సాయం చేస్తుంది. అయితే సౌదీ బహిరంగంగా భారత్‌ లేదా పాకిస్థాన్‌ వివాదాల్లో జోక్యం చేసుకోవడం లేదు. అలాగే పాక్‌ ఉగ్రవాదానికి సపోర్ట్ కూడా చేయడం లేదు. దీనివల్ల సౌదీ, పాక్ మధ్య జరిగిన ఒప్పందం వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు భావిస్తున్నారు. కేవలం తన సొంత యుద్ధాల కోసం మాత్రమే పాకిస్థాన్‌ను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఖతార్‌పై దాడి తర్వాత.. సౌదీ అరేబియా తనకు అమెరికా సాయం చేస్తుందనే నమ్మకాన్ని కోల్పోయింది. అందుకే పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 

Also Read: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు

Advertisment
తాజా కథనాలు