iPhone 17 Series: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్‌ను కొనడానికి ప్రజలు భారీగా స్టోర్ల ముందు క్యూలు కడుతున్నారు. ముంబై స్టోర్ దగ్గర అయితే భారీగా జనం ఉండటంతో గొడవ జరిగింది.

New Update
Iphone 17

Iphone 17

దేశ వ్యాప్తంగా ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఆపిల్ సంస్థ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, కొత్త ఐఫోన్ ఎయిర్‌లను రిలీజ్ చేసింది. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్‌ను కొనడానికి ప్రజలు భారీగా స్టోర్ల ముందు క్యూలు కడుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణేలోని ఆపిల్ స్టోర్ల వెలుపల అర్ధరాత్రి నుంచి పొడవైన క్యూలు ఉన్నాయి. ముంబైలోని జియో సెంటర్ అయినా లేదా ఢిల్లీలోని సాకేత్ మాల్ అయినా, ఐఫోన్ 17 కొనుగోలుదారులు భారీ సంఖ్యలో ఉన్నారు. ముంబై స్టోర్ దగ్గర అయితే భారీగా జనం ఉండటంతో గొడవ జరిగింది. 

ప్రారంభ ధర ఇదే..

క్యూలైన్లలో ఉన్న కస్టమర్లు కొట్టుకున్నారు. ఇంతలో సెక్యూరిటీ వచ్చి గొడవను తగ్గించారు. అయితే స్టోర్‌లు ఇంకా ఓపెన్ చేయలేదు. కానీ కస్టమర్లు క్యూలైన్లలో ముందుగానే వెయిట్ చేస్తున్నారు. అయితే ఐఫోన్ 17 ధర రూ.82,900 నుండి ప్రారంభమవుతుంది. ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,19,900 కు లభిస్తుంది. ప్రో మోడల్ ధర రూ.1,34,900 కు, ప్రో మ్యాక్స్ ధర రూ.1,49,900 కు లభిస్తుంది. అన్ని మోడళ్లలో బేస్ 256GB స్టోరేజ్ ఉంటుంది. 48MP కెమెరా, A19 చిప్, ప్రోమోషన్ డిస్ప్లే వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్ స్టోర్లతో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమాలో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు