/rtv/media/media_files/2025/09/19/mother-dairy-2025-09-19-11-12-53.jpg)
Mother Dairy
దసరా పండుగ సందర్భంగా మదర్ డెయిరీ పాల ధరలను తగ్గించింది. వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఒక్కో ఉత్పత్తి బట్టి రూ.2 నుంచి రూ.30 వరకు మదర్ డెయిరీ ధరలను తగ్గించింది. వీటికి సంబంధించిన కొత్త జాబితాను విడుదల చేసింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌తో పాటు అన్ని నగరాల్లో విక్రయించే మదర్ డైరీ ఉత్పత్తులు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తాయి. పాల నుంచి పనీర్ వరకు అన్ని కూడా ఇప్పుడు తక్కువ ధరకే లభించనున్నాయి.1 లీటరు UHT టోన్డ్ పాలు గతంలో రూ.77 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.75కి తగ్గించారు.
ఇది కూడా చూడండి: Stock Market: వరుస లాభాల తర్వాత నష్టాల్లోకి స్టాక్ మార్కెట్
Mother Dairy has reduced prices for milk, paneer, butter, ghee, and cheese after GST revisions.
— Mint (@livemint) September 16, 2025
Check the latest price list and savings on your favourite dairy products👇https://t.co/Y0jkiMDn1mpic.twitter.com/GnW2jM8GYm
భారీగా తగ్గిన ధరలు..
అదేవిధంగా 180 ml మిల్క్ షేక్ ధరను రూ.30 నుంచి రూ.28కు తగ్గించారు. 200 గ్రాముల మలై పనీర్ పాత ధర రూ.100 ఉండగా, కొత్త ధర రూ.95కు తగ్గించారు. 200 గ్రాముల ప్లెయిన్ పనీర్ ధరను కూడా రూ.95 నుంచి రూ.92కి తగ్గించారు. 1 లీటరు నెయ్యి MRP రూ.675 నుంచి రూ.645కి తగ్గించారు. అలాగే చీజ్‌పై కూడా మదర్ డెయిరీ ధరలను తగ్గించింది. గతంలో రూ.170 ధర ఉన్న 200 గ్రాముల చీజ్ ఇప్పుడు రూ.160కి లభిస్తుంది. అలాగే 180 గ్రాముల చీజ్ క్యూబ్స్ ధరను రూ.145 నుంచి రూ.135కి తగ్గించారు. ఇక 500 గ్రాముల వెన్న ధర రూ.305గా ఉండగా ఇప్పుడు దాని ధరను రూ.285కి తగ్గించారు. ఐస్ క్రీం 45 గ్రాముల ఐస్ క్యాండీ ధర రూ.10 నుంచి 9కి తగ్గించారు.
ఇది కూడా చూడండి: iPhone 17 Series: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు
ఇక 50 మి.లీ. వెనిల్లా కప్పు కూడా రూ.10 నుండి రూ.9కి తగ్గించారు. అలాగే హనీ చాకో స్టిక్స్, చాక్లెట్ కుకీలు, చాక్లెట్ చిప్ కుకీలు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం వంటి ఉత్పత్తుల ధర గతంలో రూ.50గా ఉండేది. మదర్ డైరీ ఐస్ క్రీం ధరను కూడా తగ్గించింది. అలాగే 45 గ్రాముల ఐస్ క్యాండీ, 50 మి.లీ వెనిల్లా కప్, 30 మి.లీ చాకోబార్ ధరను రూ.10 నుంచి రూ.9కి తగ్గించింది. 100 మి.లీ వెనిల్లా చాకో, బటర్‌స్కాచ్ కోన్‌ల ధరను రూ.30 నుంచి రూ.25 కి, రూ.35 నుంచి రూ.30 కి తగ్గించింది. భారీగా ధరలను మదర్ డెయిరీ తగ్గించడం వల్ల వినియోగదారులకు కాస్త పొదుపు అవుతాయి.