భారత సైన్యం మాపై దాడులు చేసింది.. లష్కరే తోయిబా కమాండర్ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌ తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని గతంలో ఆరోపించింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తమ స్థావరాలపై భారత్‌ దాడులు చేసిందని తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమండర్‌ ఖాసిమ్ అంగీకరించారు.

New Update
Lashkar Terrorist Sensational Comments on Pakistan Operation Sindoor Claims

Lashkar Terrorist Sensational Comments on Pakistan Operation Sindoor Claims

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.  అయితే పాకిస్థాన్‌ మాత్రం తమ పౌరులపై భారత్ దాడులు చేసిందని ఆరోపణలు చేసింది. అయితే అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. తాజాగా లష్కరే తోయిబా టాప్‌ కమండర్‌ ఖాసిమ్ దీని గురించి స్పందించారు. తమ స్థావరాలపై భారత్‌ దాడులు చేసిందని అంగీకరించారు.'' మురిద్కేలో ఉన్న మా ప్రధాన కార్యాలయం భారత్‌ చేసిన దాడుల్లో ధ్వంసమయ్యింది. ఈ కార్యాలయాన్ని గతంలో కంటే మళ్లీ భారీగా నిర్మిస్తామని'' వ్యాఖ్యానించాడు.

Also Read:  దసరా గిఫ్ట్.. భారీగా తగ్గిన పాలు, పెరుగు, నెయ్యి, ఐస్ క్రీం ధరలు.. కొత్త ధరల లిస్ట్ ఇదే!

ఆ ధ్వంసమైన కార్యాలయంలో చాలామంది ముజాహిద్దీన్‌లు(ఉగ్రవాదులు) ట్రైనింగ్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఇతడు ఓ వీడియోలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థానీ యువత ఇక్కడ ఉగ్రశిక్షణ(దౌరా ఇసుఫా)లో భాగం కావాలన్నారు. ఇందులో మతం, జిహాదీపై శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఇక మరో వీడియోలో లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ కూడా మాట్లాడాడు. పాక్‌ ప్రభుత్వం, సైన్యం తమకు ఉగ్రస్థావారాలను పునర్నిర్మించేందుకు నిధులు ఇచ్చినట్లు చెప్పాడు. ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసం చేసినటువంటి  9 ఉగ్ర శిబిరాల్లో మురిద్కే క్యాంప్‌ కూడా ఒకటి ఉన్నట్లు తెలిపాడు.     

Also Read: ఐఫోన్ 17 సేల్ స్టార్ట్.. స్టోర్ల ముందు పొట్టు పొట్టు కొట్టుకుంటున్న కస్టమర్లు

అయితే పాకిస్థాన్‌లోని ఉగ్రసంస్థలు 2026 ఫిబ్రవరి 5న కశ్మీర్‌లో సంఘీభావ దినోత్సవంపై కూడా ఫోకస్ పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అప్పటికల్లా మురిద్కేలో ఉగ్ర కాంప్లెక్స్‌ను మళ్లీ నిర్మించి సభ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిర్మించబోయే భవనమే మళ్లీ ఉగ్రశిక్షణ, ఆపరేషనల్ ప్లానింగ్‌కు కేంద్రంగా ఉండనుంది. ఇదిలాఉండగా ఇటీవల జైషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్‌ కశ్మీరి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజర్ కుటుంబం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

Also Read: సిటిజెన్ షిప్ కోసమే పెళ్ళి..డెమోక్రటిక్ నేత ఇల్హాన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు