/rtv/media/media_files/2024/12/26/3iFz02Fqh8tSV9GlmQ3d.jpg)
Russia President Putin
Putin: అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్య చేయాలనే కుట్రకు పాల్పడిదని అమెరికా జర్నలిస్ట్ టకర్ కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ పోడ్‌కాస్ట్‌లో ఆయన దీని గురించి మాట్లాడారు. హత్య కుట్రకు సంబంధించి ఆరోపణలు చేసినప్పటికీ దానికి సంబంధించిన ఆధారాల గురించి మాట్లాడలేదు. అయితే టకర్ కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలపై రష్యాన్ పార్లమెంటులో చర్చనీయాంశమైంది.
Also Read: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దీనికి స్పందించిన స్పీకర్ వయచెస్లాన్ వొలొదిన్.. పుతిన్ హత్యకు ఎలాంటి కుట్ర పన్నినా అణుయుద్ధంతో పాటు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కార్ల్‌సన్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇంతవరకు అమెరికా స్పందించలేదు. దీంతో అమెరికా తీరుపై కూడా వొలొదిన్ విమర్శలు చేశారు. రోజుల గడుస్తున్న కూడా అందరూ మౌనంగా ఉన్నారని.. దీనికి అమెరికా తన వైఖరిని చెప్పడం లేదని విమర్శలు చేశారు.
Also Read: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్
రష్యా సంచలన ప్రకటన
పుతిన్ హత్య చేయాలని కుట్ర పన్నడం నేరమని, అంతర్జాతీయ భద్రతకు ప్రమాదమని వ్యాఖ్యానించారు. అంతేకాదు దీనిపై అంతర్జాతీయ సంస్థలు కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. గతంలో హంగేరి ప్రధానమంత్రి విక్టర్ ఆర్బాన్, స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోలపై కుట్రలు జరిగినట్లు వొలిదిన్ తెలిపారు. అమెరికాలో ఎన్నికల వేళ ట్రంప్‌పై జరిగిన దాడిని కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే పుతిన్ భద్రతపై ప్రమాదం పొంచి ఉన్న వేళ అలెర్ట్‌గా ఉండాలని రష్యన్ స్పెషల్ సర్వీసెస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: క్లాస్ రూమ్లో స్టూడెంట్తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి! .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
Also Read: ఐసీసీ సీఈవో రాజీనామా.. పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడమే కారణమా?