/rtv/media/media_files/2025/01/29/yOoBGfNB5hWe4TdsjPHe.jpg)
prof marriage
క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని హరిన్‌ఘటలో ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (MAKAUT) సైకాలజీ విభాగంలో ఈ ఘటన జరిగింది. స్టూడెంట్, లేడీ ప్రొఫెసర్ కు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది.
Also Read : ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు..AI సహాయంతో పంపిణీ!
A lady Professor in MAKAUT is 'getting married' to her young student in the office. pic.twitter.com/coXaVGH7s7
— Abir Ghoshal (@abirghoshal) January 29, 2025
వర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసి, ప్రొఫెసర్ నుండి వివరణ కోరింది. అయితే ఇది క్లాస్‌లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఇది అకడమిక్ ప్రాజెక్ట్‌లో భాగమని, అసలు పెళ్లి కాదని చెప్పారు. సైకాలజీ డిపార్డ్ మెంట్ ప్రతిష్టనే దిగజార్చడానికి కొందరు వీడియోలను లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్దారు.
Also Read : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో తండ్రి, కుమారుడు మృతి!
A student was tried of going to college every day
— Mr. Roy (@iamroysunny) January 29, 2025
He married to that teacher so that he can learn from home #westbengal pic.twitter.com/dWEIycklFb
అయితే విచారణ ముగిసే వరకు సెలవులపై వెళ్లాల్సిందిగా ప్రొఫెసర్‌ను కోరినట్లు అధికారులు తెలిపారు.ముగ్గురు మహిళా అధ్యాపకులతో కూడిన కమిటీ విచారణ జరుపుతోందని తెలిపారు. విచారణ ముగిసే వరకు తరగతుల్లో చేరవద్దని విద్యార్థిని కూడా కోరినట్లు తెలిపారు.
Also Read : వరంగల్లో పాక్ ఉగ్రవాదుల కలకలం.. బిర్యానీ సెంటర్ నడుపుతూ..!
Also Read : బీజేపీ అభ్యర్థి కాళ్లు మొక్కిన మోదీ.. వీడియో వైరల్