Sunita Williams: నడక మర్చిపోయాను, గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా: సునితా విలియమ్స్

అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునితా విలియమ్స్‌ తాజాగా అక్కడి నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాని చెప్పారు.

New Update
Sunita Williams

Sunita Williams

భారత సంతతి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ టెక్నకల్ సమస్య వల్ల కొన్ని నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె భూమిపైకి ఎప్పుడు వస్తారానేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజాగా అంతరిక్షం నుంచి విద్యార్థులతో మాట్లాడారు. జీరో గ్రావిటీలో నెలల తరబడి కూర్చోవడం, పడుకోవడం చాలా కష్టమని తెలిపారు. '' నేను అంతరిక్షంలో చాలాకాలం నుంచి ఉంటున్నాను. 

Also Read: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ హామీలు.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో

నడక కూడా ఎలా ఉంటుందో మర్చిపోయాను. అది గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. కనీసం పడుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకపోయింది. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలగా తేలియాడుతున్నాను. దీనివల్ల నేలపై నడిచిన అనుభూతిని కూడా గుర్తుతెచ్చుకోలేకపోతున్నాను. మా మిషన్ ప్రకారం చూసుకుంటే నెలరోజుల్లోపే అంతరిక్షం నుంచి భూమిపైకి తిరిగిరావాలి. కానీ ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంతకాలం ఇక్కడే ఉండంటం ఆశ్చర్యం కలిగిస్తోందని'' సునితా విలియమ్స్‌ అన్నారు.  

ఇదిలాఉండగా 2024 జూన్ 6న.. 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్‌ విలోమోర్‌ బోయింగ్ స్టార్‌లైనర్‌ క్యాప్సుల్స్‌లో అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన విషయం తెలిసిందే. జూన్ 14న వీళ్లు భూమికి తిరుగుపయనం చేయాల్సి ఉంది. కానీ వారు వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ వల్ల సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడు నెలలుగా వారు స్పేస్‌ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు.  

Also Read: AI రంగంలో చైనా సంచలనం.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బే

అయితే వాళ్లిద్దరిని భూమి పైకి తీసుకొచ్చేందుకు బైడెన్‌ సర్కార్‌ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని తాజాగా ఎలాన్‌ మస్క్‌ కూడా విమర్శలు చేశారు. వాళ్లు చేసిన ఆలస్యం వల్ల ఆస్ట్రోనాట్స్ ఇబ్బందులు పడాల్సి వస్తోందని మండిపడ్డారు. వ్యోమగాములను భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలని స్పేస్‌ఎక్స్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కోరినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వాళ్లను తీసుకొచ్చేందుకు చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు సమచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు