/rtv/media/media_files/2025/01/29/kyppLDVwO3b7IW8CHZyD.jpg)
chinese Zoo sells tiger urine bottle for rs 600 as cure for arthritis
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచ నలుమూలల్లో జరిగిన వింతలు, విడ్డూరాలు క్షణాల్లో కళ్లముందు కనిపించేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ విచిత్రమైన సంఘటన నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒక జూ తప్పుడు కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. పులి మూత్రం తాగితే.. కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, కండరాల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయని తెలిపింది.
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
అందుకు సంబంధించి ప్రచారాన్ని చేయడం ప్రారంభించడంతో వార్తల్లోకెక్కింది. అంతేకాకుండా ఆ పులి మూత్రం బాటిల్ రూ.600 అమ్ముతున్నట్లు జూ నిర్వాహకులు తెలిపారు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
చైనాలో వింత ఘటన
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ బిఫెంగ్క్సియా వైల్డ్ లైఫ్ జూపార్కు ఇటీవల రుమటాయిడ్ ఆర్థరైటిస్, కండరాల నొప్పులు, ఇతర పరిస్థితులకు చికిత్సగా పులి మూత్రాన్ని ప్రచారం చేయడం కనిపించింది. జూలోని ఒక సందర్శకుడు దాని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
రూ.600లకే 250 గ్రాముల మూత్రం
అక్కడ సైబీరియన్ పులుల నుంచి పట్టిన 250 గ్రాముల బాటిల్ మూత్రాన్ని 50 యువాన్లకు అమ్ముతున్నట్లు ఒక పోస్టర్ కనిపించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.600 గా ఉంది. అయితే పులి మూత్రాన్ని బాటిల్‌లో ఎలా పడతారు అనేది ఇప్పుడు జోరుగా డిస్కషన్ నడుస్తుంది.
ఇదెలా ఉంటే పులి మూత్రాన్ని తాగిన తర్వాత అలెర్జీ వంటి ప్రతిచర్యలు సంభవించినప్పుడు దానిని నిలిపివేయాలని కూడా ఆ పోస్టర్‌లో వివరించారు. అయితే చైనీస్ వైద్యులు, శాస్త్రవేత్తలు మాత్రం దీనిని ఆమోదించడం లేదు. పులి మూత్రం సాంప్రదాయ ఔషధం కాదని కొందరు వైద్యులు చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదిగా ఖండించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.