ICC CEO Jeff Alladize: ఐసీసీ సీఈవో రాజీనామా.. పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగడమే కారణమా?

ఐసీసీ సీఈఓ జెఫ్ ఏలడైజ్ పదవికి రాజీనామా చేశారు. పాక్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో స్పష్టత లేకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. టోర్నీ జరగనున్న కరాచీ స్టేడియం పనుల వివరాలు కూడా జెఫ్ ఇంకా ఐసీసీకి చెప్పకపోయినట్లు సమాచారం.

New Update
ICC CEO Jeff Alladize

ICC CEO Jeff Alladize Photograph: (ICC CEO Jeff Alladize)

ICC CEO Jeff Alladize: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రారంభం కాకముందే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సీఈఓ జెఫ్ ఏలడైజ్ పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champion Trophy) నిర్వహణ గురించి పాకిస్థాన్ స్పష్టత ఇవ్వకపోవడం వల్లే జెఫ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

నిధుల దుర్వినియోగం..

గతేడాది అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ టైమ్‌లో నిధుల దుర్వినియోగం జరిగాయి. అప్పటి నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు భావిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్ ఇప్పటి వరకు ఎలాంటి పనులు పూర్తి చేయలేదు. కరాచీ స్టేడియం పనులు పూర్తి కాకపోవడం వంటి విషయాలు కూడా జెఫ్ ఐసీసీకి చెప్పకపోయినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

ఇదిలా ఉండగా.. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్స్ హెడ్ క్రిస్ టెట్లీ, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ క్లెయిర్ ఫర్లాంగ్, అవినీతి నిరోధక విభాగం హెడ్ అలెక్స్ మార్షల్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు