UNHRCలో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఒకేఒక్కడు.. ఇండియా స్ట్రాంగ్ కౌంటర్

UNHRC సమావేశంలో భారత్ పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ సొంత ప్రజల మీదే బాంబులు వేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపించింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ భారత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

New Update
Indian diplomat Kshitij Tyagi

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) సమావేశంలో భారతదేశం పాకిస్తాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ సొంత ప్రజల మీదే బాంబులు వేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని భారత్ ఆరోపించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రస్తావిస్తూ భారత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

UNHRC 60వ సెషన్‌లో భారత దౌత్యవేత్త క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ, పాకిస్తాన్ అంతర్గత సంక్షోభాలపై దృష్టి పెట్టకుండా, అంతర్జాతీయ వేదికలను భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. "మా భూభాగాన్ని ఆక్రమించాలనే కోరిక మానుకొని, అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని(POK)ని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పతనమవుతున్న తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, సైనిక ఆధిపత్యంతో అణచివేయబడిన రాజకీయ వ్యవస్థను చక్కదిద్దుకోవడం, హింసతో మాయని మచ్చ పడిన మానవ హక్కుల రికార్డును మెరుగుపరుచుకోవడంపై పాకిస్తాన్ దృష్టి పెట్టాలి" అని త్యాగి సూచించారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికే పాకిస్తాన్ ఎక్కువగా సమయం కేటాయిస్తోందని, అందుకే తమ సొంత ప్రజల మీద బాంబులు వేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఇటీవల పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో జరిపిన వైమానిక దాడుల్లో అమాయక పౌరులు, మహిళలు, పిల్లలు మరణించారని ఆయన ప్రస్తావించారు.

మానవ హక్కుల మండలి తన పనిని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలను ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ సమావేశం ఉద్దేశాలను పక్కదారి పట్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని భారత్ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ, తమ ప్రజలనే వేధిస్తున్న పాకిస్తాన్‌కు మానవ హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని భారత్ తేల్చి చెప్పింది. ఈ దారుణమైన చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ చర్యలపై అంతర్జాతీయ సమాజం కఠినంగా స్పందించాలని భారత్ డిమాండ్ చేసింది.

Advertisment
తాజా కథనాలు