/rtv/media/media_files/2025/07/14/supreme-court-2025-07-14-16-13-08.jpg)
‘Freedom Of Speech Is Being Abused’, Supreme Court Pulls Up Cartoonist Over Posts On PM
భావా ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు కార్డూనిస్టులు, స్టాండప్ కమెడియన్లు ఈ మధ్య భావా ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడింది. అరెస్టు నుంచి తనను కాపాడాలని కోరిన కార్టునిస్ట్ హేమంత్ మాలవీయ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అతడిని అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.
Also Read: నిమిష ప్రియను కాపాడలేం.. కేంద్రం సంచలన ప్రకటన
‘Freedom Of Speech Is Being Abused’ - PM Modi
ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్టునిస్టు హేమంత్ మాలవీయ గతంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్‌పై వేసిన కార్టున్ అభ్యంతరకంగా ఉందంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై పలువురు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్ కోరుతూ హేమంత్ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. జులై 3న దీనిపై విచారణ జరగగా అక్కడి కోర్టు హేమంత్‌కు చివాట్లు పెట్టింది. ఆయన విచక్షణ లేకుండా ప్రవర్తించాడని చెబుతూ ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్డున్ ప్రచూరితమైందని హేమంత్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆ సమయంలో వ్యాక్సిన్ భద్రతపై తప్పుడు సమాచారం రావడం, ప్రజలు ఆందోళనకు గురవున్న నేపథ్యంలో.. ఓ రాజకీయ నాయకుడు పౌరుడికి టీకాలు వేస్తున్నట్లు వ్యంగ్య చిత్రం గీసినట్లు చెప్పారు. కానీ ఇందులో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే రక్షణ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో హేమంత్‌కు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది.
Also Read : Axiom-4 mission: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
Also Read : స్పెర్మ్ కౌంట్ త్వరగా పెరగాలంటే ఈ జ్యూస్ తాగండి.. వరదలా పారుతాయి!
cartoon image | Supreme Court | rtv-news | telugu-news