/rtv/media/media_files/2025/07/14/axiom-4-2025-07-14-17-20-10.jpg)
Axiom-4 Undocks From ISS, Astronauts On Their Way Home
యాక్సియం 4 మిషన్‌లో భాగంగా ఇటీవల భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు వెళ్లిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో వీళ్లు భూమి పైకి రానున్నారు. ఈ వ్యోమగాములను కిందకి తీసుకొచ్చే డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ అన్‌డాకింగ్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్ అయ్యింది. పలు విన్యాసాల తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది.
Also Read: మోదీపై అభ్యంతరకర కార్టూన్.. భావా ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగంపై సుప్రీం ఆగ్రహం
Axiom-4 Undocks From ISS
ఈ స్పేస్‌క్రాఫ్ట్ 21 గంటల పాటు ప్రయాణించనుంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో ల్యాండ్ అవుతుంది. ఆ తర్వాత వ్యోమగాములను ఆ ప్రాంతం నుంచి క్వారంటైన్‌కు తరలిస్తారు. సుమారు 7 రోజుల పాటు వారు పర్యవేక్షణలో ఉంటారు.
Also Read: ISS నుంచి శుభాంశు శుక్లా తెస్తున్న 263కేజీల నిధి.. ఏంటో తెలిస్తే షాక్!
ఇదిలాఉండగా యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా టీమ్ జూన్ 25న ఐఎస్‌ఎస్‌కు బయలుదేరిన సంగతి తెలిసిందే. 28 గంటల ప్రయాణం తర్వాత వారు స్పేస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. వీళ్ల టీమ్ దాదాపు 18 రోజుల పాటు అందులో ప్రయోగాలు చేశారు. ప్రయోగాల్లో భాగంగా వీళ్లు తమ మానసిక ఆరోగ్యంపై అధ్యయనం చేశారు. శుభాంశు శుక్లా గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలపై కలిగే నష్టాల గురించి పరిశోధన చేశారు. అలాగే స్పేస్‌లో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న దానిపై ఓ వీడియోను ఆయన భారత విద్యార్థుల కోసం రూపొందించారు. అంతేకాదు శుక్లా ISS నుంచి కొన్ని వస్తువులను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : లంగావోణీలో రాశి అందాలు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Shubhanshu Shukla: वापसी से पहले शुभांशु ने दोहराए Rakesh Sharma के शब्द | ISS | Axiom-4 Return
— Amar Ujala (@AmarUjalaNews) July 14, 2025
अन्य खबर के लिए दिए गए लिंक पर क्लिक करें : https://t.co/gOi2dG0XwK#shubhanshushukla#iss#isro#spacex#axiom4#amarujalanews@isropic.twitter.com/kXEX0iUjM0
national-news | rtv-news | telugu-news