UAE Lottery: లాటరీలో రూ.240కోట్లు.. అప్పుడే ఇండియాకు రానంటున్న అనిల్‌ బొల్లా..ఎందుకంటే?

లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిదే ఓ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. ఏకంగా రూ.240 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.

New Update
FotoJet - 2025-11-07T075125.183

Rs. 240 crore in the lottery.. Anil Bolla says he will not come to India

UAE Lottery:  లక్ష్మీదేవి ఎప్పుడు ఎలా ఎవరిని కరుణిస్తుందో తెలియదు. అలాంటిదే ఓ భారతీయ యువకుడ్ని మాములుగా కనికరించలేదు. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడు అయిపోయాడు. తల్లి సెంటిమెంట్‌తో రూ.1,200 పెట్టి లాటరీ టికెట్‌ కొంటే.. ఏకంగారూ.240 కోట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 88 లక్షల మంది పాల్గొన్న లాటరీ అనిల్‌కు తగలడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. భారత్‌కు చెందిన అనిల్‌కుమార్‌ బొల్లా ఏడాదిన్నర కిందట ఉద్యోగం కోసం యూఏఈకి వెళ్లాడు.  అయితే.. 2025 అక్టోబర్ 18న యూఏఈలోని అబుదాబిలో జరిగిన లక్కడీ డే డ్రాలో రూ.240 కోట్ల (Dh100 మిలియన్) బంపర్‌ లాటరీ గెలుచుకున్నట్లు ప్రకటించారు.  

Also Read :  ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో పాక్ ప్రభుత్వం..రాజ్యాంగ సవరణకు యోచన

Rs. 240 Crore In The Lottery - UAE

Also Read :  IND-USA: వచ్చే ఏడాది ఇండియా వస్తా.. ట్రంప్

ఈ లాటరీ కోసం ఒక్కో టికెట్‌కు 50దిర్హామ్‌(రూ.1200) పెట్టి 12 టికెట్లు కొన్నాడు అనిల్‌. అయితే అందులో అతనికి తగిలిన టికెట్‌ నెంబర్‌ 11. ఆ నెంబర్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే?. తన తల్లి పుట్టినరోజు అంట. అందుకే ఆ నెంబర్‌ను ఎంపిక చేసుకున్నాడు... తన తల్లి ఆశీర్వాదంతోనే అదృష్టం కలిసొచ్చిందని.. అంతకు మించి తాను ఏదీ చేయలేదని నవ్వుతూ చెబుతున్నాడు అనిల్‌. కాగా అంతా డబ్బు వచ్చినప్పటికీ అప్పడే యూఏఈ ని వదిలి రానని చెప్పాడు. తాజాగా స్థానిక మీడియాతో తొలిసారి మాట్లాడాడు. భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి వెల్లడిస్తూ. రూ.కోట్లు గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతానికి ఉద్యోగం మాత్రం వీడనని, మరో పదేళ్ల పాటు యూఏఈలోనే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు.

‘‘అక్టోబర్‌ 18నాటి డ్రా కోసం రెండు నెలల కింద 12 టికెట్లు కొనుగోలు చేశా. అందులో ఒకటి నా జీవితాన్నే మార్చేసింది. రూ.కోట్ల జాక్‌పాట్‌ గెలుచుకున్నానని నా మిత్రుడు చెప్పాడు. అది విని తొలుత షాక్‌కు గురయ్యా. లాటరీ సంస్థ నుంచీ ఫోన్‌ రావడంతో అది నిజమేనని నమ్మా. చేతిలో ఇంత డబ్బు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఉద్యోగం వదలనని తేల్చి చెప్పాడు.

యాస్‌ లేదా సాదియాత్‌ ద్వీపంలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తా. మరో పదేళ్లపాటు యూఏఈలోనే ఉండాలని అనుకుంటున్నా అని అనిల్‌ తెలిపాడు. నిపుణుల సలహాతో స్టాక్‌ మార్కెట్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా. స్నేహితుడితో కలిసి ఓ ఐటీ కన్సల్టెన్సీ ప్రారంభిస్తానన్నారు. అదృష్టంతో వచ్చిన ఈ డబ్బులో కొంత మొత్తాన్ని దాతృత్వానికి ఖర్చు పెడతానన్నారు. నా తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తానన్నారు. వారిని ఇక్కడికే తీసుకొస్తా. యూఏఈ చాలా సురక్షితమైన దేశం. ఇక్కడ నా జీవితాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందని అనిల్‌ బొల్లా పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు