Pakistan: ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేతిలో పాక్ ప్రభుత్వం..రాజ్యాంగ సవరణకు యోచన

పాకిస్తాన్ పై తన పట్టు మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ ఆసిమ్ మునీర్. ఆయనకు అనుకూలంగా పాక్ ప్రభుత్వం రాజ్యాంగాన్నే సవరించాలని యోచిస్తోంది.

New Update
Pakistan Chief Asim Munir

పాకిస్తాన్ మరియు విదేశాలలో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్మునీర్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.. ఇస్లామాబాద్ తన రాజ్యాంగాన్ని సవరించాలని యోచిస్తోంది. ఆసిమ్మునీర్ ఆయన సైన్యానికి మరింత అధికారాలను కల్పించాలని పాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీని కోసం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం త్వరలో పార్లమెంటులో 27వ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టనున్నట్లు ధృవీకరించింది. ఇందులో సాయుధ దళాల కమాండ్‌కు సంబంధించిన ప్రతిపాదిత మార్పులు కూడా ఉన్నాయి. దీంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్మునీర్ కు పాకిస్తాన్ పై మరింత పట్టు చిక్కనుంది.

మళ్ళీ ఆర్మీ చేతుల్లో పాకిస్తాన్ ప్రభుత్వం..

పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆర్మీ పాత్ర ఎప్పుడూ ముఖ్యంగా ఉంటుంది. ఆ దేశ ప్రత్యక్ష పాలన చరిత్ర, పౌర ప్రభుత్వాలపై దాని విస్తృత ప్రభావం, జాతీయ భద్రత, ఆర్థిక వ్యవస్థలో ఆర్మీ పాత్ర ప్రభావం అత్యధికంగా ఉంటుంది. రాజ్యాంగ సవరణకు సంబంధించి పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనేట్‌లో మాట్లాడుతూ దీనిని ధృవీకరించారు. ఖచ్చితంగా, ప్రభుత్వం దానిని తీసుకువస్తోంది...27వ సవరణ వస్తుంది అని ఆయన తెలిపారు. సూత్రాలు, చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా మేము దానిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తాము అని చెప్పారు.

సవరణలు ఏముండొచ్చు?

27వ రాజ్యాంగ సవరణ ద్వారా పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను మార్పు చేసే అవకాశం ఉంది. ఇది ఆర్మీ చీఫ్, సాయుధ దళాల కమాండ్ నియామకాన్ని నియంత్రిస్తుంది. ఇందులోనే ఆర్మీ ఛీఫ్ ఆసిమ్మునీర్ కు విశిష్ట అధికారాలు కట్టబెట్టనున్నారు. దాంతో పాటూ ఈ ప్రతిపాదనలో రాజ్యాంగ న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడం, కార్యనిర్వాహక న్యాయాధికారులను పునరుద్ధరించడం, న్యాయమూర్తుల బదిలీ విషయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సమాఖ్య వనరులలో రాష్ట్రాల వాటాను తగ్గించడం మరియు విద్య, జనాభా సంక్షేమ మంత్రిత్వ శాఖల నియంత్రణను రాష్ట్రాల నుండి సమాఖ్య ప్రభుత్వానికి మార్చడం, జాతీయ ఆర్థిక కమిషన్ కింద ప్రాంతీయ వాటాకు రక్షణను ముగించడం వంటి వాటిని సవరించనున్నారు.

Also Read: The Girl Friend: రష్మిక కెరియర్ బెస్ట్..రాహుల్ బ్రిలియంట్ టేకింగ్..ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ

Advertisment
తాజా కథనాలు