Earthquake in Afghanistan: అధికారిక ప్రకటన.. 800లకు పైగా మృతి, 2800 మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 800 మందికి పైగా మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఉంది.

New Update
Afghanistan Earthquake

ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో 800 మందికి పైగా మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. భూకంప కేంద్రం నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భూకంపం ఆదివారం రాత్రి 11:47 గంటల సమయంలో సంభవించింది. ఈ సమయంలో చాలా మంది ప్రజలు గాఢ నిద్రలో ఉండటంతో ప్రాణ నష్టం అధికంగా సంభవించింది. భూకంపం ప్రభావం కునార్, లాఘ్మాన్, నంగర్‌హార్ ప్రావిన్సులపై ఎక్కువగా పడింది. అనేక చోట్ల ఇళ్లు, భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా కునార్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం సంభవించిన ప్రాంతాలు కొండ ప్రాంతాలు కావడంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం కావడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి చాలా సమయం పడుతోంది. శిథిలాల కింద ఇంకా ఎంతోమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు