Modi-Putin: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన పుతిన్‌.. ఏం మాట్లాడారంటే ?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీకి సోమవారం ఫోన్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశం కానున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

New Update
Putin calls PM Modi

Putin calls PM Modi

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోదీకి సోమవారం ఫోన్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశం కానున్న వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఫోన్‌ కాల్‌లో మోదీ, పుతిన్‌ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై మాట్లాడారు. ఇటీవల పుతిన్.. ట్రంప్‌తో భేటీ అయిన దాని గురించి చర్చించారు. అయితే సమస్యను పరిష్కరించేందుకు శాంతియుత ఒప్పందం చేసుకోవాలని ప్రధాని మోదీ పుతిన్‌కు సూచనలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌లో వెల్లడించారు. 

Also Read: 18 ఏళ్లు దాటిన వారికే పో*ర్న్ సైట్స్‌ యాక్సెస్‌.. కట్‌ చేస్తే ఊహించని ఫలితం

Putin Dials PM Modi

'' నాకు ఫోన్‌ చేసి, ట్రంప్‌తో జరిగిన సమావేశంపై విషయాలు పంచుకున్న నా స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలపై శాంతియుత తీర్మానం చేసుకోవాలని భారత్‌ పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మేము కూడా అన్నివిధాలుగా మద్దతిస్తామని'' మోదీ రాసుకొచ్చారు. 

Also Read: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?

అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్.. సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కూడా ఫోన్‌ చేశారు. ట్రంప్‌తో జరిగిన సమావేశంపై ఆయనతో కూడా విషయాలు పంచుకున్నారు. రామఫోసా కూడా శాంతి ఒప్పందం కూడా సపోర్ట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇరుదేశాధినేతలు రష్యా-సౌతాఫ్రికా మధ్య వ్యూహాత్మక సంబంధాల గురించి చర్చలు జరిపారు. 

Also Read: ముగింపులో కీలకంగా క్రిమియా.. దీని కోసమేనా 7లక్షల ప్రాణాలు బలి

ఇదిలాఉండగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మళ్లీ ముదురే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మరో షాకింగ్ ఘటన జరిగింది. రష్యాకు చెందిన ఓ ట్రక్కు ఉక్రెయిన్‌కు ఆయుధాలు తరలిస్తోంది. దీంతో అలెర్ట్ అయిన ఉక్రెయిన్ ఆర్మీ ఆ ట్రక్కును పేల్చేసింది. ఆ ట్రక్కు నీటిపై ఉన్న వంతెనపై వస్తుండగా ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. కాసేపట్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా అధ్యక్షుడితో సమావేశం కానున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం జరగడం చర్చనీయాంశమవుతోంది. ట్రక్ పేల్చివేయడం వల్ల రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు