Zelensky: అటు రష్యా.. ఇటు ట్రంప్.. మధ్యలో నలిగిపోతున్న జెలెన్స్కీ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే!?

రష్యా, ఉక్రెయిన్ మధ్య 3 సంవత్సరాలకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ఒత్తిడిని మరింత పెంచాయి.

New Update
Zelensky under pressure (1)

Zelensky: రష్యా, ఉక్రెయిన్(Ukraine-Russia) మధ్య మూడు సంవత్సరాలకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ఒత్తిడిని మరింత పెంచాయి. ట్రంప్ తన ట్వీట్లలో, జెలెన్స్కీ కోరుకుంటే యుద్ధాన్ని వెంటనే ముగించగలరని, అందుకు క్రిమియా, నాటో సభ్యత్వంపై ఆశలు వదులుకోవాలని పేర్కొన్నారు.

Also Read: ముగింపులో కీలకంగా క్రిమియా.. దీని కోసమేనా 7లక్షల ప్రాణాలు బలి

ఉక్రెయిన్ ముందున్న సవాళ్లు

ఈ వ్యాఖ్యలు జెలెన్స్కీకి ఒక పెద్ద సవాలుగా మారాయి. ఒకవైపు తన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని, రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని జెలెన్స్కీ కోరుకుంటున్నారు. మరోవైపు, యుద్ధం కొనసాగితే ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ, సైనిక నష్టం మరింత పెరుగుతాయని, అమెరికా సహాయం కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయనపై ఒత్తిడి ఉంది. ట్రంప్ మాట వినకుంటే భవిష్యత్‌లో అమెరికా నుంచి అందే ఆయుధ, ఆర్థిక సహాయ నిలిపివేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి జెలెన్స్కీ మెడపై కత్తిగా ఉంది. అటు యుద్ధం కొనసాగించలేదు. ఇటు క్రిమియాను ఒదులు కోలేడు. భూభాగాన్ని వదులుకోవడం అంటే దాదాపు యుద్ధంలో ఓడిపోయినట్లే దీంతో ఉక్రెయిన్ దీర్ఘంగా ఆలోచిస్తోంది. 2022 ఫ్రిబ్రవరి నుంచి జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ పెద్ద దేశమైన రష్యాకు ధీటుగా పోరాడుతున్నా.. ఆ దేశం చాలా కోల్పోయింది. దాదాపు 3లక్షల సైన్యం ప్రాణాలు వదిలింది. బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం వాటిల్లింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఉక్రెయిన్ ఇంకా చాలా కోల్పోడానికి సిద్ధంగా ఉండాలి. 

Also Read: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్‌ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!

జెలెన్స్కీ ట్రంప్ సూచించిన రష్యా ప్రతిపాదనలను తిరస్కరించారు. ఏ భూభాగాన్ని వదులుకోవడానికి తమ రాజ్యాంగం అనుమతించదని, అలా చేయడం రష్యాకు మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో యూరోపియన్ దేశాల మద్దతును కూడగట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే, శాంతిని స్థాపించాలనే అమెరికా వైఖరి, ముఖ్యంగా ట్రంప్ పట్టుదల, జెలెన్స్కీని ఒక సంక్లిష్టమైన స్థితిలో పడేసింది. క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాలను రష్యాకు అప్పగించేందుకు ఉక్రెయిన్ అంగీకరిస్తే, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ వర్గాలు సూచించాయి.

జలెన్స్కీకి రాజకీయ సవాళు

కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం, ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ చర్చల్లో క్రిమియా, డాన్‌బాస్ ప్రాంతాల భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. జెలెన్స్కీ ఈ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, తన దేశ ప్రయోజనాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఏదేమైనా, జెలెన్స్కీకి తన దేశ ప్రజలు, అంతర్జాతీయ మద్దతుదారుల మధ్య ఒక సమతుల్యతను సాధించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సున్నితమైన రాజకీయ సవాలుగా మారింది, దీని పరిష్కారం యుద్ధం ముగింపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.

యూరోపియన్ మిత్రదేశాల మద్దతు కోసం

జెలెన్స్కీ ఈ విషయంలో యూరోపియన్ దేశాల మద్దతును కోరుతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల నాయకులు ఉక్రెయిన్‌కు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించారు. అయితే, శాంతిని స్థాపించాలనే అమెరికా వైఖరి, ముఖ్యంగా ట్రంప్ పట్టుదల, జెలెన్స్కీని సంక్లిష్ట పరిస్థితిలో పడేసింది. క్రిమియా, నాటో వంటి కీలక విషయాలలో వెనకడుగు వేయకుండా, రష్యాను వెనక్కి నెట్టడం జెలెన్స్కీకి ఒక సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో, జెలెన్స్కీ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ యుద్ధం ముగింపుపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు