Porn Site: 18 ఏళ్లు దాటిన వారికే పో*ర్న్ సైట్స్‌ యాక్సెస్‌.. కట్‌ చేస్తే ఊహించని ఫలితం

బ్రిటన్‌లో 18 ఏళ్ల లోపు ఉన్నవారికి అశ్లీల చిత్రాలు చూడకుండా నిషేధం విధించారు. జులై 25న ఈ రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో పోర్న్‌హబ్‌ సైట్‌కు రెండు వారాల్లోనే 10 లక్షల మందికి పైగా సందర్శకులు తగ్గిపోయారు.

New Update
Porn site traffic plummets as UK age verification rules enforced

Porn site traffic plummets as UK age verification rules enforced

బ్రిటన్‌(Britain) లో పోర్నోగ్రఫీ(Pornography) కి సంబంధించి కఠినమైన రూల్స్‌ అమలు చేస్తున్నారు. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి అశ్లీల చిత్రాలు చూడకుండా నిషేధం విధించారు. జులై 25న ఈ రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. చివరికి ఊహించని ఫలితాలు వచ్చాయి. బ్రిటన్‌లో ఎక్కువ మంది చూసే పోర్న్‌హబ్‌ సైట్‌కు రెండు వారాల్లోనే 10 లక్షల మందికి పైగా సందర్శకులు తగ్గిపోయారు. ఈ విషయాన్ని సిమిలర్ వెబ్‌ అనే డేటా విశ్లేషణ సంస్థ వెల్లడించింది. ఎక్కువగా చూసే పోర్న్‌ వెబ్‌సైట్లను జులైలో రోజుకు ఎంతమంది చూశారు ? అలాగే ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు ఎంతమంది చూశారనే దాన్ని పోల్చి చూసి ఈ వివరాలను బయటపెట్టింది. 

Also read: ఆపరేషన్ సిందూర్‌ సమయంలో కరాచీ నుంచి పాక్‌ నౌకలు మాయం.. ఏం జరిగింది ?

Porn Site Traffic Decreased In UK

బ్రిటన్‌లో ఎక్కువ మంది పోర్న్‌హబ్‌ సైట్‌(Porn Hub Site) ను చూస్తున్నారు. కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాక జులై 24వ తేదీ నుంచి ఆగస్టు 8 వరకు ఈ సైట్‌ వీక్షించే వాళ్ల సంఖ్య 47 శాతం తగ్గిందని సిమిలర్‌ వెబ్‌డేటా పేర్కొంది. అలాగే మరో ప్రముఖ పోర్న్‌ సైట్‌ ఎక్స్ వీడియోస్‌ కూడా 47 శాతం తగ్గిందని.. ఓన్లీఫ్యాన్స్‌ అనే మరో సైట్‌ చూసే వాళ్ల సంఖ్య 10 శాతం తగ్గినట్లు వెల్లడించింది. జులై నెలలో పోర్న్‌హబ్‌ సైట్‌లో రోజువారి సగటు వీక్షకుల సంఖ్య 32 లక్షలు ఉంది. కానీ ఆగస్టులో మొదటి 9 రోజుల్లో అది 20 లక్షలకు పడిపోయింది. కొన్ని చిన్న చిన్న సైట్లలో అశ్లీల చిత్రాల చూసేవాళ్ల సంఖ్య పెరిగినట్లు డేటా చెబుతోంది.  

ఇదిలాఉండగా దీనికి సంబంధించి పోర్న్‌హబ్‌ ప్రతినిధి కూడా ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటిపై కఠినంగా ఆంక్షలు విధిస్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఆ రూల్స్‌ను పాటించే ఆయా సైట్లలో వీక్షకుల సంఖ్య తగ్గుతోందని తెలిపారు. కానీ వీటిని పాటించని సైట్ల వీక్షకుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ఇక బ్రిటన్‌లో వయసు ధ్రువీకరణకు సంబంధించి రూల్స్ తీసుకోచ్చాక.. అక్కడ యాపిల్ యాప్‌ స్టోర్‌లో వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ యాప్స్‌ను ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Also Read: హిందూ యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే రూ.5 లక్షలు..

ఈ యాప్స్‌లో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారనేది VPN దాచిపెడుతుంది. మీరు వేరే దేశంలో ఉండి ఇంటర్నెట్ వాడుతున్నట్లు చూపిస్తాయి. ఈ యాప్స్‌ అనేవి ఒక ప్రాంతంసో ఎంతమంది ఏఏ సైట్లు చూస్తున్నారనే సమాచారన్ని ఇవ్వవు. రోజుకు సగటున కోటీ 40 లక్షల మంది ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాల చూస్తున్నట్లు మీడియా రెగ్యులేటర్ ఆఫ్‌కామ్‌ అంచనా వేసింది. అయితే వీక్షకు క్రెడిట్‌ కార్డును చెక్‌ చేయడం, ఫొటో ఐడీలను మ్యాచ్‌ చేయడం, సెల్ఫీల ద్వారా వెబ్‌సైట్లు వయసును అంచనా వేయడం కోసం మీడియా రెగ్యులేటర్ ఎన్నో మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజా మార్పుల వల్ల ఊహించని పరిణామాలు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అశ్లీల చిత్రాల కోసం చాలామంది డార్క్ వెబ్‌ లాంటి సైట్లకు వెళ్తారని చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు