Italy: లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్.. నిరసనలతో అట్టుడుకుతున్న ఇటలీ

పాలస్తీనాకు అనుకూలంగా ఇటలీలో నిరసనలు మిన్నంటాయి.  పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ రోమ్ తో సహా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు ఇవి హింసకు కూడా దారి తీశాయి. 

New Update
italy

Let's Block Everything-Italy

ప్రస్తుతం ఇటలీ(italy) నిరసనలతో అట్టుడికిపోతోంది. పాలస్తీనా(palesthina) కు అనుకూలంగా అక్కడ పౌరులు ఆందోళనలకు దిగారు.  పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ తో సహా మొత్తం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.  ఇవి కొన్ని చోట్ల హిసకు దారి తీశాయి. పాలస్తీనఆ జెండాతో ఆందోళనకారులు రోడ్లపైకి జనాలు వచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్యనా ఘర్షణ జరిగింది.  ఇందులో నిరసనకారులు రెచ్చిపోయి... కారులు, షాపుల అద్దాలను ధ్వంసం చేశారు.  ఈ ఘర్షణల్లో 60 మంది పోలీసులు గాయపడ్డారు.  10 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read :  India-US: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

రోడ్ల పైకి జనాలు..

పాలస్తీనాకు మద్దతు ఇవ్వకపోవడంపై ఇటలీ ప్రధాని మెలోని(Melone) పై తిరుగుబాటు జరుగుతోంది. మెలోని నిర్ణయాన్ని అక్కడి జనాలు వ్యతిరేకిస్తూ నిరసనకారులు రోడ్డెక్కారు. ఇటలోని అన్ని నగరాల్లో 'లెట్స్ బ్లాక్ ఎవ్రీథింగ్(Lets Back Everything) అనే నినాదంతో  ఆందోళనలు చెలరేగాయి.  నిరసకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలు రైల్వే స్టేషన్లు, ప్రజా ఆస్తులను  ధ్వంసం చేశారు.  ఈ ఘటనల కారణంగా జెనోవా, లివోర్నో పోర్టులను ఇటాలియన్ డాక్ కార్మికులు క్లోజ్ చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇటలీ ప్రధాని మెలోనీ స్పందించారు. నిరసకారుల విధ్వంసంలో గాజాలో మార్పు జరగదని ఆమె అన్నారు. ఆందోళనలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస సిగ్గుచేటని విమర్శించారు.   ముందు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నామని ప్రకటించిన ఇటలీ.. ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా ఓటు వేసింది. కానీ తరువాత ఆ నిర్ణయాన్ని ప్రధాని జార్జియా మెలోని వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి పాలస్తీనాను అధికారికంగా గుర్తించకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు.  దీని కారణంగానే ఇటాలియన్లు దేశ వ్యాప్తంగా స్ట్రైక్ కు పిలుపునిచ్చారు. 

Also Read: Pakistan Team: ఆర్మీచీఫ్, పీసీబీ చీఫ్ రావాల్సిందే..పాక్ జట్టుపై ఇమ్రాన్ ఖాన్ వ్యంగ్యాస్త్రాలు..

Advertisment
తాజా కథనాలు