Israel Hamas War | గాల్లో పే*లిన 3 బస్సులు | 2 Buses Exploded In Israel | Bat Yam City | RTV
పార్లమెంటులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన జై పాలస్తీనా నినాదం వివాదం రేపుతోంది. వేరే దేశానికి జై ఎలా కొడతారు అందులో అడుగుతుంటే...అందులో తప్పేముందుని అసదుద్దీన్ అంటున్నారు. అయితే సభ్యులు మాత్రం దీని మీద కంప్లైట్ చేశారని అంటున్నారు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు.
పాలస్తీనా ప్రధాని మొహమ్మద్ శతాయే తన పదవికి రాజీనామా చేశారు. గాజాతో పాటు వెస్ట్ బ్యాంకులో హింసాత్మక ఘటనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.
ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య కాల్పుల విరమణ ముగిసిన మొదటి రోజే గాజాపై వైమానిక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 175మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడిలో 2 పాలస్తీనా జర్నలిస్టులు కూడా మరణించారు.
ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాలస్తీనా ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఆ దేశ ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. విపత్తు సహాయ సామాగ్రిని అలాగే ఔషధలాను ఆదివారం గాజాకు తరలించింది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటుగా ఇతర వస్తువులను మానవతా సాయంలో భాగంగా పంపిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ 'ఎక్స్' లో వెల్లడించారు.
హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది.
ఇజ్రాయెల్ ఒక్కటే తమ లక్ష్యం కాదు...ప్రపంచం అంతా తమ చట్టం కిందకు తెచ్చుకుంటామని హెచ్చరిస్తోంది పాలస్తీనా మిలటరీ హమాస్. రెండు దేశాల మధ్య యుద్ధం పెరిగి పెద్దదవుతున్న వేళ హమాస్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.