India-US: యూఎస్ కు భారత్ కీలకం...యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో

ఇండియా..తమకెంతో కీలకమైన భాగస్వామని వాఖ్యలు చేశారు  అమెరికా విదేశాగం మంత్రి మార్కో రూబియో. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో  సమావేశం అయ్యారు. 

New Update
marco

అదనపు సుంకాలు... దాని తరువాత హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు(H1B Visa Fee Hike) ఉద్రిక్తత నడుమ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు.  భారత్ తమకు చాలా ముఖ్యమని.. ఆదేశం ముఖ్యమైన భాగస్వామని అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో  సమావేశం అయ్యారు.  దీని తరువాత మార్కో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ట్రంప్ టారిఫ్ ల తరువాత ఇరుదేశాల విదేశాంగ మంత్రులూ కలవడం ఇదే మొదటిసారి.

Also Read :  తండ్రి వర్ధంతి కోసం భారత్‌ వచ్చిన టెక్కి.. తిరిగి అమెరికా వెళ్లేందుకు రూ.7 లక్షల ఖర్చు

కీలక విషయాలపై చర్చ..

యూఎన్జీఏలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశమయ్యానని చెప్పారు. వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి కీలకమైన అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు.   ఈ సందర్భంగా భారత్ తమకు ఎంతో కీలకమని అన్నారు. క్వాడ్ తో సహా ఇండో- పసిఫిక్ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కలిసి పనిచేసేందుకు రూబియో, జైశంకర్ లు అంగీకరించారని అమెరికా ప్రకటించింది.  మరోవైపు మార్కో రూబియోతో భేటీ కావడం ఆనందంగా ఉందంటూ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ కూడా ఎక్స్ పోస్ట్ చేశారు.  అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తమ మధ్య  చర్చలు జరిగాయని తెలిపారు.  ప్రాధాన్య రంగాల్లో పురోగతి సాధించేందుకు సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించుకున్నామనిచెప్పారు.  ఈ సమావేశంలో అదనపు సుంకాలు, హెచ్ 1బీ వీసా ఫీజు విషయాలు కూడా చర్యకు వసచ్చినట్టు తెలుస్తున్నాయి. 

Also Read: H-1B visa: హెచ్ 1-బీ వీసా ఫీజుల నుంచి డాక్టర్లకు మినహాయింపు..ఆలోచనలో ట్రంప్ సర్కార్

Advertisment
తాజా కథనాలు