UPSC అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చాలామంది డిగ్రీలు పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యూపీఎస్సీ(UPSC) అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' అనే పోర్టల్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు

New Update
PM Modi announces ‘Pratibha Setu’ for aspirants in Mann Ki Baat, what it means

PM Modi announces ‘Pratibha Setu’ for aspirants in Mann Ki Baat, what it means

చాలామంది డిగ్రీలు పూర్తయ్యాక సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు ఆసక్తి చూపుతుంటారు. తాజాగా ప్రధాని మోదీ(pm modi) కీలక ప్రకటన చేశారు. యూపీఎస్సీ(UPSC) అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా 'ప్రతిభా సేతు' అనే పోర్టల్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీనివల్ల UPSC అభ్యర్థులకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. మన్‌కీబాత్‌ 125వ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ కూడా ఒకటని.. ఏటా చాలామంది విద్యార్థులు రాస్తుంటారని అన్నారు. కష్టపడి చదివే విద్యార్థులు ఒక్కోసారి స్వల్ప తేడాతోనే ఉత్తీర్ణత కాలేకపోతుంటారని తెలిపారు.

Also Read: ఏనుగు, డ్రాగన్ కలిసి అమెరికాపై దండయాత్ర.. SCO సమ్మిట్‌లో కీలక పరిణామం

PM Modi Announces ‘Pratibha Setu’

అలాంటి అభ్యర్థుల కోసమే ప్రతిభా సేతు పోర్టల్‌ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.  సివిల్స్ పరీక్షల అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్‌లిస్టులో పేరు లేని అభ్యర్థుల వివరాలను ఇకనుంచి ఈ 'ప్రతిభా సేతు' పోర్టల్‌లో పొందుపరుస్తామని చెప్పారు. ఈ పోర్టల్‌లో అభ్యర్థుల వివరాలను చూసే ప్రైవేటు కంపెనీలు తమ కంపెనీల్లో వారికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

Also Read: విదేశీ విద్యార్థులపై ట్రంప్ భారీ బాంబు.. ఎఫ్ 1 వీసాపై ఇకపై అమెరికా వెళ్లడం కష్టమే!

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలే దేశాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. వరదలు పోటెత్తడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారని తెలిపారు. దీనిపై జాతీయ విపత్తు సహాయక బృందాలు, భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని ప్రశంసించారు. అలాగే వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.  

Also Read: హీరోయిన్‌ నడుమును అసభ్యంగా తాకిన పవర్‌ స్టార్‌...భారీ నెట్‌ వర్క్‌ ఉందని బెదిరించడంతో..

జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir) లో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎన్నో అనర్థాలు జరినప్పటికీ అనేక విషయాల్లో అక్కడి ప్రజలు పురోగతి సాధిస్తున్నారని తెలిపారు. ఇటీవల శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సులో ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్‌ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కూడా మోదీ ప్రస్తావించారు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి మొత్తం 800 మందికి పైగా అథ్లెట్లు ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నట్లు గుర్తుచేశారు. పురుషులతో సమానంగా మహిళా అథ్లెట్లు కూడా ప్రతిభ చూపినట్లు పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా కశ్మీర్‌లో పుల్వామాలో మొదటిసారిగా డేనైట్ క్రికెట్ మ్యాచ్ జరిగిందని.. దేశం మార్పు దిశగా పయనిస్తోందని వివరించారు. 

Also Read: అమెరికాలో సంచలనం.. ట్రంప్ చనిపోయాడనే వార్తలకు కారణం ఇతనే!!

Advertisment
తాజా కథనాలు