Trump is Dead: అమెరికాలో సంచలనం.. ట్రంప్ చనిపోయాడనే వార్తలకు కారణం ఇతనే!!

అసలు ట్రండ్ చనిపోయాడని వార్త ఓ ఇంటర్వ్యూ వల్లే పుట్టింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలే ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలను పెంచింది. దీంతో "ట్రంప్ చనిపోయారు" అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది.

New Update
JD Vance Terrible Tragedy

JD Vance about trump

అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ చనిపోయాడని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క 2 రోజులు ట్రంప్ మీడియాలో కనిపించకపోయే సరికి అగ్రరాజ్యంలో సునామీ సృష్టించబడింది. అసలు ట్రండ్ చనిపోయాడని వార్త ఓ ఇంటర్వ్యూ వల్లే పుట్టింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలే ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలను పెంచింది. దీంతో "ట్రంప్ చనిపోయారు" అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. వాస్తవానికి, ఈ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని, స్వయంగా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టం చేశారు. అయినప్పటికీ, వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు ఆజ్యం పోశాయి. నిజం గడప దాటేలోపు అబద్దం ఊరంతా తిరిగొస్తుందనే తెలుగు సామెతను పోలి ఉంది.

అసలు జరిగింది ఇదే..

కొద్ది రోజుల క్రితం, జేడీ వాన్స్ "USA టుడే" అనే వార్తాపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ సందర్భంగా, ఒకవేళ అధ్యక్షుడికి "పెను విషాదం" సంభవిస్తే, అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ ఆరోగ్యంపై ఇప్పటికే నెలకొన్న అనుమానాలను ఈ వ్యాఖ్యలు మరింత పెంచాయి. వాస్తవానికి, వాన్స్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, ట్రంప్ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని, రాత్రి చివరి వరకు పని చేస్తారని, ఉదయాన్నే ముందుగా మేల్కొంటారని వివరించారు. అయినప్పటికీ, "పెను విషాదం" అనే పదాన్ని ఉపయోగించడం ప్రజల్లో అపార్థానికి దారితీసింది. 

దానికి తోడు రోజుకు ఒక్కసారైనా తన సంచలన నిర్ణయాలతో వార్తల్లో ఉండే ట్రంప్.. రెండు రోజులుగా ఉలుకూ లేదు.. పలుకు లేదు. భారత్‌పై 50శాతం పన్నులు అమలు అయిన రోజు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. అంతేకాదు నిత్యం యుద్ధాలను ఆపుతున్నానని చెప్పుకునే వ్యక్తి రెండు రోజులు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో తెలియకపోతే ట్రంప్ చనిపోయాడని పుకార్లు పుట్టాయి. దానికి తోడు జేడీ వ్యాన్స్ ఇంటర్వ్యూకి కొన్ని రోజుల క్రితమే ఇంటర్‌నేషనల్ మీడియా సంస్థలు ట్రంప్ అనారోగ్య సమస్యల గురించి, ఆయన చేతిపై ఉన్న మచ్చ పెద్దగా అవుతుందని ఆందోళనకరమై వార్తలు రాసింది. ఇవన్నీ ట్రంప్ చనిపోయాడనే పుకార్ల వ్యాప్తి బలాన్ని చేకుర్చాయి.

పుకార్లకు కారణాలు

వాన్స్ వ్యాఖ్యలతో పాటు, ట్రంప్ ఆరోగ్యం గురించి ఇటీవల వెలువడిన కొన్ని వార్తలు కూడా ఈ పుకార్లకు కారణమయ్యాయి. కొన్ని నెలల క్రితం ట్రంప్ చేతిపై గాయాలు, కాళ్ల వాపులు కనిపించడంతో, ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత, వైద్య పరీక్షల్లో ఆయనకు "క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ" అనే రక్తప్రసరణ సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఇది సాధారణ వ్యాధి అని, ప్రాణానికి ప్రమాదం కాదని వైట్‌హౌస్ వర్గాలు వివరించాయి. ఈ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, జేడీ వాన్స్ వ్యాఖ్యలు ఈ పుకార్లకు మరింత ఊతమిచ్చాయి.

ట్రంప్ రియాక్షన్

సోషల్ మీడియాలో ఈ పుకార్లు విస్తృతంగా వ్యాపిస్తుండటంతో, ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో స్పందించారు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను ప్రస్తావిస్తూ తాను ఇంకా బతికే ఉన్నట్లు పరోక్షంగా తెలిపారు. అలాగే, తర్వాత రోజు ఆయన గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న అనుమానాలను వైట్‌హౌస్ వర్గాలు, ట్రంప్ స్వయంగా ఖండించారు. ఈ సంఘటన అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఒక సాధారణ వ్యాఖ్య ఎలా తప్పుగా అర్థం చేసుకోబడి, ఒక పెద్ద పుకారుకు దారితీసిందో ఈ సంఘటన నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు