/rtv/media/media_files/2025/08/31/f-1-visa-changes-2025-08-31-08-52-27.jpg)
F 1 Visa New rules
విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లి చదివి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాలనుకునే విద్యార్థులకు ఇకపై గడ్డు కాలమే అని చెప్పవచ్చు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎఫ్ 1 వీసాపై మరిన్ని మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఎఫ్ -1 వీసా ద్వారా విదేశీ విద్యార్థులు అమెరికా వెళ్లి తమకు నచ్చిన కోర్సు చదివి, పూర్తి అయ్యే వరకు అమెరికాలోనే ఉండవచ్చు. ఈ కోర్స్ పూర్తి అయిన 60 రోజుల వరకు కూడా అక్కడ ఉండవచ్చు. ఇక అక్కడే ఉద్యోగం సంపాదించి సెటిల్ కావాలనుకునే వారు మరికొన్ని రోజులు ఉండటానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఓపీటీకి అప్లై చేసుకుంటే ఎంచుకున్న కోర్సును బట్టి గడువు తేదీ పెంచేవారు.
🚨 Attention Students Heading to the USA! 🇺🇸
— Auscanz Overseas Education Pvt. Ltd. (@AuscanzE) August 30, 2025
Big changes in F-1 visa rules you should know
❌ No instant transfers – minimum 1 year at your current institution
❌ No pursuing back-to-back degrees at the same level
❌ OPT grace period reduced to 30 days#USVisa#F1Visapic.twitter.com/zd0LkGE8wS
ఇది కూడా చూడండి: Trump is Dead: అమెరికాలో సంచలనం.. ట్రంప్ చనిపోయాడనే వార్తలకు కారణం ఇతనే!!
కఠినతరం కానున్న రూల్స్..
ఇలా ఉద్యోగం సంపాదించి అక్కడే చాలా మంది సెటిల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఈ రూల్స్‌ను ట్రంప్ కాస్త కఠినం చేయనున్నారు. ఎఫ్ 1 వీసా ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు అమెరికా వెళ్లిన ఏడాదిలో వారి ప్రోగ్రామ్స్‌ను మార్చుకునే అవకాశం ఉండకుండేలా మార్పులు చేయనున్నారు. ఒక డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మరో డిగ్రీ లేదా అంతకంటే తక్కువ స్థాయి డిగ్రీ కొందరు చదువుతుంటారు. ఇలా చేయడానికి మళ్లీ ఎఫ్ 1 వీసా పొందడానికి వీలు కుదరదు. ఈ వీసా కింద ఒక కోర్సు చేయడానికి వెళ్లి ఇంకో కోర్సు అసలు చేయకూడదు. ఏదైనా కొత్త కోర్సు చేయాలంటే మళ్లీ స్వదేశానికి వచ్చి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు. అయితే కోర్సు ప్రకారం అమెరికాలో గరిష్టంగా నాలుగేళ్ల పరిమితితో ఎఫ్ 1 వీసా ఇస్తారు. దీని తర్వాత కూడా అక్కడ ఉండాలని అనుకుంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకు దరఖాస్తు చేయాలి.
గడువు 30 రోజులకు కుదించనున్న అమెరికా..
కోర్సు పూర్తి అయిన తర్వాత అమెరికాలో 60 రోజుల వరకు ఉండవచ్చు. ఇకపై కేవలం 30 రోజుల వరకు మాత్రమే గడువును కుదించనున్నారు. ఈ గడువు పూర్తి అయిన తర్వాత స్వదేశానికి వచ్చి మళ్లీ హెచ్ 1 బీ వీసా పొంది అమెరికా వెళ్లా్ల్సిందే. అయితే ఈ విద్యార్థికి హెచ్ 1 బీ వీసా రావడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఇకపై ఓపీటీ ద్వారా అప్లై చేసుకునే రూల్ అమెరికా సర్కార్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ ఓపీటీ ద్వారా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు, హెచ్ 1 బీ వర్కింగ్ వీసా వంటివి పొందాలంటే కష్టం అవుతుంది. వెంటనే ఎక్స్‌టెన్షన్ ఆఫ్ స్టేకు అప్లై చేసుకుని, అధిక జీతం వచ్చే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో హెచ్ 1 బీ వీసా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: ‘ట్రంప్ చనిపోయాడు’ వార్తలపై వైట్‌హౌస్ క్లారిటీ