/rtv/media/media_files/2025/08/30/power-star-pawan-singh-inappropriately-touches-heroines-waist-2025-08-30-20-29-13.jpg)
Power Star Pawan Singh inappropriately touches heroine's waist
Pawan Singh : భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్ వివాదంలో చిక్కకున్నాడు. ఓ వేదికపై హీరోయిన్ నడుమును అసభ్యంగా తాకి వివాదాల పాలయ్యాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ హీరోయిన్ స్పందించింది. ఇకపై అతనితో సినిమాలు చేయనని ప్రకటించింది.
వివరాల ప్రకారం భోజ్‌పురికి చెందిన పవన్ సింగ్ స్టార్‌నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అటు సింగర్‌గా కూడా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. భోజ్‌పురి పవర్ స్టార్‌గా అక్కడి ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇదంతా భానే ఉన్నా ఇటీవల ఓ కార్యక్రమంలో వేదికపై ఆయన హీరోయిన్ అంజలి నడుమును అసభ్యంగా తాకడం వివాదానికి దారితీసింది. వేదికపై ఆమె నడుమును పదే పదే టచ్ చేస్తూ ఇబ్బంది పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు మూడు రోజులైనా ఇబ్బంది పడిన హీరోయిన్ స్పందించకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అలా చేయడం ఆమెకు నచ్చింది కావచ్చని దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అంజలి ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియోను విడుదల చేసింది.
‘‘గత రెండు రోజులుగా నేను చాలా బాధపడుతున్నాను. లక్నోలో జరిగిన ఘటనపై మీరు ఎందుకు స్పందించలేదని, చర్యలు ఎందుకు తీసుకోలేదని నాకు నిత్యం ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. కొందరు తప్పుగా అర్థం చేసుకుని అలా చేస్తున్నపుడు నేను నవ్వుతున్నాను సరదాగా ఉన్నానని అంటున్నారు. ఎవరైనా మన అనుమతి లేకుండా శరీరాన్ని తాకితే.. మజాగా, ఆనందంగా ఉంటుందా?. చాలా కోపం వస్తుంది బాధగా ఉంటుంది. నేను ఈవెంట్‌లో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ నా నడుమును తాకాడు. దీంతో నేను అక్కడ ఏదైనా అంటుకుంది కావచ్చు దాన్ని తీస్తున్నారని అనుకున్నాను. నేను ఆ రోజు కొత్త చీర కట్టుకున్నందున బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటకు వచ్చిందేమేనని అనుకుని నవ్వాను. కానీ అతను నన్ను కావాలనే తాకాడని గమనించలేకపోయాను. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చి నా టీమ్ మెంబర్‌ను అడిగితే అక్కడ ఏమీ లేదని చెప్పడంలో షాక్ తిన్నాను.
అప్పుడు నాకు కోపంతో పాటు బాధ కలిగింది. ఈ విషయాన్ని అతనితో ప్రైవేట్‌గా మాట్లాడదామని అనుకునేలోపే పవన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి బయటకు మాట్లాడితే.. పవన్ సింగ్‌కి భారీ నెట్‌వర్క్ ఉందని నన్ను కొంతమంది బెదిరించారు. ఇండస్ట్రీలో ఉండాలంటే అలాంటివి తట్టుకోక తప్పదని అనడంతో నేనే సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. అక్కడితో ఆ విషయం సర్దుమణుగుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. ఏ అమ్మాయిని అయినా తప్పుగా తాకడం తప్పు. అలా నా ప్రాంతంలో చేస్తే.. ప్రజలే బుద్ది చెప్పేవారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇకపై భోజ్‌పురి చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. ముఖ్యంగా పవన్‌తో చేయాలని అనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం అంజలి వీడియో వైరల్‌గా మారడంతో పవర్‌స్టార్ పవన్ సింగ్‌ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో దూషిస్తున్నారు.
Also Read:Maldives Vacation: మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్ .. ఫొటోలు చూశారా!